Telugu Global
NEWS

మహానాడు కాదు అది వల్లకాడు " స్పీకర్ తమ్మినేని

టీడీపీ మహానాడు పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కుళ్ళి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారాయన. అది మహానాడు   కాదని, వల్లకాడు అని చెప్పారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారని, 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేదని అన్నారు. వైసీపీ సామాజిక న్యాయ సునామీలో టీడీపీ, ఇతర విపక్షాలన్నీ కొట్టుకుపోవాల్సిందేనన్నారు తమ్మినేని. రాబోయే ఎన్నికల […]

మహానాడు కాదు అది వల్లకాడు  స్పీకర్ తమ్మినేని
X

టీడీపీ మహానాడు పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కుళ్ళి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారాయన. అది మహానాడు కాదని, వల్లకాడు అని చెప్పారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారని, 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేదని అన్నారు.

వైసీపీ సామాజిక న్యాయ సునామీలో టీడీపీ, ఇతర విపక్షాలన్నీ కొట్టుకుపోవాల్సిందేనన్నారు తమ్మినేని. రాబోయే ఎన్నికల రణక్షేత్రంలో, కౌరవులంతా కట్టకట్టుకుని వచ్చినా వైసీపీ నేతలంతా ఏకమై పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. జగన్నాధుడి రథచక్రాల కింద విపక్షాలు నలిగి, నశించి, కుంగి, కృశించిపోవాల్సిందేనన్నారాయన. వైసీపీకి వేసే ప్రతి ఓటు సామాజిక న్యాయాన్ని, ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉంటుందని చెప్పారు.

దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తా.. తోలుతీస్తా అంటూ మాట్లాడిన చంద్రబాబు ఒక నాయకుడా అని నిలదీశారు తమ్మినేని. కుల, మత, పార్టీలకతీతంగా నేడు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, నాడు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ జరిగిందని వివరించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించిన ఆయన.. అంబేద్కర్ జిల్లాను ప్రతిపక్షాలు సమర్థిస్తున్నాయో, వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయ భేరి సదస్సుకి హాజరైన తమ్మినేని, జగన్ సంక్షేమ, సామాజిక న్యాయ పాలనని ప్రశంసల్లో ముంచెత్తారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్దఎత్తున పదవులు ఇచ్చి, కేబినెట్ లో 70 శాతం మందికి అవకాశమిచ్చి సామాజిక న్యాయం చేయడం వల్లే తామంతా ఈ వేదికపై ఉన్నామని చెప్పారు తమ్మినేని. రాష్ట్రంలో కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, బడుగు, బలహీనవర్గాలకు ఆత్మగౌరవంతో తలెత్తుకునే హోదాను ఇచ్చిన జగన్‌ ను మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు తమ్మినేని సీతారాం.

ALSO READ: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. యుద్ధం మొదలైనట్టే..

First Published:  27 May 2022 3:20 AM
Next Story