Telugu Global
National

ఈ ఐఏఎస్ చేస్తున్న పనికి సలాం కొట్టాల్సిందే

ప్రజలకు సేవ చేయడానికే యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్‌ లు అయ్యామని చాలా మంది కలెక్టర్లు, ఎస్పీలు చెప్తుంటారు. తీరా ఉద్యోగాలు వచ్చాక తమ మాట మీద నిలబడే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. రెండు రోజుల క్రితమే ఇద్దరు బ్యూరోక్రాట్ భార్యాభ‌ర్త‌లు తమ కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి అథ్లెట్లు అడ్డుగా ఉన్నారంటూ.. వారిని స్టేడియం నుంచి వెళ్లగొట్టారు. దీంతో కేంద్ర హోం శాఖ భర్తను లద్దాఖ్, భార్యను అరుణాచల్‌ప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. కానీ […]

ఈ ఐఏఎస్ చేస్తున్న పనికి సలాం కొట్టాల్సిందే
X

ప్రజలకు సేవ చేయడానికే యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్‌ లు అయ్యామని చాలా మంది కలెక్టర్లు, ఎస్పీలు చెప్తుంటారు. తీరా ఉద్యోగాలు వచ్చాక తమ మాట మీద నిలబడే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. రెండు రోజుల క్రితమే ఇద్దరు బ్యూరోక్రాట్ భార్యాభ‌ర్త‌లు తమ కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి అథ్లెట్లు అడ్డుగా ఉన్నారంటూ.. వారిని స్టేడియం నుంచి వెళ్లగొట్టారు. దీంతో కేంద్ర హోం శాఖ భర్తను లద్దాఖ్, భార్యను అరుణాచల్‌ప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. కానీ మనం చెప్పుకోబోయే ఐఏఎస్ ఆఫీసర్ రూటే సెపరేట్.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు ఆడవాళ్లు ఎవరని అడిగితే.. ఏ పల్లెటూరికి చెందిన మహిళలో కూలికి పోయి వస్తున్నారని తప్పకుండా చెప్తాం. కానీ వీరిద్దరిలో ఒకరు ఐఏఎస్ అధికారి అంటే నమ్మగలమా..? కానీ ఇది నిజం. అస్సాంలో తీవ్రమైన వరదలు ముంచెత్తడంతో గ్రామాలన్నీ బురదమయం అయ్యాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి సమస్యలను తెలుసుకోవడానికి కచ్చర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ జల్లి కీర్తి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక సాధారణ చీర కట్టుకొని బురదలో నడుస్తూ.. స్థానికుల సమస్యలను గుర్తించారు. అస్సాం వరదలకు దాదాపు 20 జిల్లాల్లోని 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటిలో కచ్చర్ జిల్లా కూడా ఒకటి.

జల్లి కీర్తి బురదలో నడుస్తూ గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకం అయిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. దీంతో కీర్తి ఎవరు అంటూ అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆమె చేస్తున్న సేవకు నెటిజన్లు సలాం కోడుతున్నారు. అస్సాంలోని హైలాకండి జిల్లాకు ఆమె తొలి మహిళా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది. 33 ఏళ్ల కీర్తి పుట్టిన స్థలం, తల్లిదండ్రుల వివరాలు తెలియకపోయినా.. ఆమె ఆదిత్య శశికాంత్ అనే బిజినెస్‌మాన్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తున్నది.

First Published:  27 May 2022 1:39 PM IST
Next Story