Telugu Global
NEWS

దావోస్ టు విశాఖ..

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల సారథులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ తో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో అధిక శాతం విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయి. విశాఖను యూనికార్న్ స్టార్టప్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలియజేశారు సీఎం జగన్. ఇప్పటికే 7700 కోట్ల రూపాయల పెట్టుబడులు యూనికార్న్ స్టార్టప్ రూపంలో విశాఖకు చేరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. నాలుగో రోజు […]

దావోస్ టు విశాఖ..
X

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల సారథులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ తో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో అధిక శాతం విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయి. విశాఖను యూనికార్న్ స్టార్టప్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలియజేశారు సీఎం జగన్. ఇప్పటికే 7700 కోట్ల రూపాయల పెట్టుబడులు యూనికార్న్ స్టార్టప్ రూపంలో విశాఖకు చేరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. నాలుగో రోజు సమావేశాల్లో యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈవోలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

యూనికార్న్ స్టార్టప్ అంటే..?
స్టార్టప్ కంపెనీలలో అత్యంత భారీ పెట్టుబడితో మొదలయ్యే వాటిని యూనికార్న్ స్టార్టప్ అంటారు. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడితో కంపెనీలు మొదలు పెడితే.. వాటిని యూనికార్న్ స్టార్టప్ జాబితాలో చేరుస్తారు. ఇప్పుడు భారత్ లో కూడా ఇలాంటి స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వాలు వివిధ రకాల రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామంటోంది ఏపీ ప్రభుత్వం. ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ సంస్థ మీషో, ఆన్ లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్, క్రిప్టో కరెన్సీ తరహా సేవలందిస్తున్న కాయిన్ స్విచ్, పర్యాటక బుకింగ్‌ పోర్టల్‌ ఈజ్‌ మై ట్రిప్‌, ఆన్‌ లైన్‌ లెర్నింగ్‌ సంస్థ కొర్‌ సెరా.. సంస్థల ప్రతినిధులు సీఎం జగన్ తో సమావేశమై.. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి బైజూస్‌ పాఠ్యప్రణాళికను రాష్ట్ర విద్యార్థులకు అందిస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుష్మిత్‌ సర్కార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రికార్డులను భద్రపరచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని కాయిన్‌ స్విచ్‌ సంస్థ తెలిపింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి చేయూత అందించి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించే విషయంలో తమ సహకారం ఉంటుందని ఈజ్ మై ట్రిప్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

ALSO READ: నేడే 'సామాజిక బస్సుయాత్ర'

First Published:  26 May 2022 2:28 AM IST
Next Story