Telugu Global
NEWS

మోడీపై ప్రశ్నల వర్షం....నగరం నిండా ఫ్లెక్సీలు

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ, రాబ్వాల్సిన ప్రాజెక్టులు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నలు గుప్పిస్తూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఫ్లెక్సీల్లో ఉన్న విషయం, అవి కట్టిన ప్రదేశాల వివరాలు: ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది ?’ –నెక్లెస్ రోడ్ దగ్గర‌ ‘ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ […]

మోడీపై ప్రశ్నల వర్షం....నగరం నిండా ఫ్లెక్సీలు
X

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ, రాబ్వాల్సిన ప్రాజెక్టులు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నలు గుప్పిస్తూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఫ్లెక్సీల్లో ఉన్న విషయం, అవి కట్టిన ప్రదేశాల వివరాలు:

‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది ?’ –నెక్లెస్ రోడ్ దగ్గర‌

‘ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమయ్యింది ?’ –రైల్వే స్టేషన్ దగ్గర‌

‘బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమయ్యింది ?’ –బాలానగర్ దగ్గర‌

‘కేంద్రం మెడికల్ కాలేజీలను ఎందుకు ఇవ్వలేదు ?’ –గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర‌

‘తెలంగాణకు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్’ ఏమయ్యింది ?’ –ఉస్మానియా యూనివర్సిటీలో

‘ఐఐఎమ్ ఎక్కడ ?’–ఐఎస్ బీ దగ్గర‌

‘ఫార్మాసిటీకి ఆర్థిక సహాయం ఏమైంది ?’ –పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ లో

‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎక్కడ ?’ –నిఫ్ట్ వద్ద‌

‘హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు రిలీఫ్ ఫండ్స్ ఎందుకు ఇవ్వలేదు ?’ –దుర్గం చెరువు దగ్గర‌

”తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు ?’ –టాంక్ బండ్ వద్ద‌

‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ?’ –నెక్లెస్ రోడ్ దగ్గర‌

‘గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హైదరాబాద్ నుంచి గుజరాత్ కు ఎందుకు తరలించారు ?’ –నేచర్ కేర్ ఆస్పత్రి వద్ద‌

‘నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏమయ్యింది ?’ –బోయిన్ పల్లి లో

‘తెలంగాణకు నవోదయ విద్యాలయం ఎందుకు మంజూరు చేయలేదు ?’ –పికెట్ కేంద్ర విద్యాలయం వద్ద‌

‘తెలంగాణకు ఐటీఐఆర్ ఎందుకు మంజూరు చేయలేదు ?’ –విప్రో సర్కిల్ దగ్గర‌

‘మిషన్ భగీరథ కోసం నీతీ అయోగ్ రికమండ్ చేసిన ఫండ్స్ ఎందుకు ఇవ్వలేదు ?’ –ఖైరతాబాద్ దగ్గర‌

‘తెలంగాణకు ఒక్క మెగా పవర్ లూమ్ టెక్స్ టైల్ క్లస్టర్ కూడా ఎందుకు మంజూరు చేయలేదు ?’ –గన్ పార్క్ వద్ద

First Published:  26 May 2022 8:57 AM IST
Next Story