Telugu Global
National

ముఖ్యమంత్రి అవుదామనుకుంటే గుమాస్తా అయ్యాడు

ఆయన ముఖ్యమంత్రి అయిపోదామనుకున్నాడు…. అందుకోసం ఎన్నో రాజకీయాలు చేశాడు. ఎంతో మందిని ఎదిరించాడు….పార్టీలు మారాడు… అయినా ముఖ్యమంత్రి అవలేకపోయాడు. కానీ చివరకు ప్రస్తుతం 40 రూపాయల రోజు కూలీకి క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతను ఎవరనే ప్రశ్న మీలో తలెత్తింది కదా ? ఆయనే ఒకప్పటి క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలయ్యాక ఆయన తన పీసీసీ అధ్యక్ష పదవికి […]

siddu
X

ఆయన ముఖ్యమంత్రి అయిపోదామనుకున్నాడు…. అందుకోసం ఎన్నో రాజకీయాలు చేశాడు. ఎంతో మందిని ఎదిరించాడు….పార్టీలు మారాడు… అయినా ముఖ్యమంత్రి అవలేకపోయాడు. కానీ చివరకు ప్రస్తుతం 40 రూపాయల రోజు కూలీకి క్లర్క్ గా పని చేస్తున్నాడు.

అతను ఎవరనే ప్రశ్న మీలో తలెత్తింది కదా ? ఆయనే ఒకప్పటి క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలయ్యాక ఆయన తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అది జరిగిన కొద్ది రోజులకే 1988 రోడ్డు రేజ్ కేసులో దోషిగా తేలి పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

జైలు శిక్ష పడ్డవాళ్ళతో జైల్లో ఏదో ఒక పని చేయిస్తారు. అందుకు కూలీ కూడా ఇస్తారు. సిద్దూ ప్రముఖ వ్యక్తి కావడంతో భద్రతా కారణాల రీత్యా అతన్ని తన గది నుండి బైటికి రానివ్వరు. అందువల్ల బైట చేసే పనులు కాకుండా ఆయనకు గుమాస్తా పని అప్పజెప్పారు. జైలు రికార్డులను రాయడం, సుధీర్ఘమైన కోర్టు తీర్పులను బ్రీఫ్ చేయడం లాంటి పనులను ఆయన తన గదినుంచే చేస్తారు. అందుకోసం సిద్దూకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు నెలల పాటు ఆయనకు ఎలాంటి జీతం చెల్లించరు. శిక్షణ పూర్తయిన తర్వాత అతనికి పని నైపుణ్యాన్ని బట్టి రోజుకు 40 రూపాయల నుండి 90 రూపాయల వరకు చెల్లిస్తారు.

జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధూ మంగళవారం నుంచి క్లర్క్‌గా పని ప్రారంభించాడు. అతను రెండు షిఫ్టులలో పని చేస్తాడు. ఉదయం 9నుంచిమధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆయనకు పని అప్పగిస్తారు.

కాగా, సిద్ధూ ఉన్న బ్యారక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐదుగురు వార్డెన్లు, నలుగురు జైలు ఖైదీలు కూడా సిద్ధూపై నిఘా ఉంచుతున్నారు.

మరో వైపు స్థూలకాయం, మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడుతున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం మెడికల్ బోర్డు డైట్ చార్ట్‌ను తయారు చేసింది. డైట్ చార్ట్ ఇంకా జైలుకు చేరలేదు. సిద్ధూ సలాడ్, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. తనకు గోధుమలు అలర్జీ అని చెప్పి దాల్ రోటీ తినడానికి నిరాకరించాడు.

ALSO READ: పోషకాహార లోపంపై యుద్దం: తెలంగాణ ప్రయత్నాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి

First Published:  26 May 2022 7:58 AM IST
Next Story