Telugu Global
NEWS

తెలంగాణలో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న హ్యుండై

తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ప్రతీ రోజూ పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు హ్యుండై గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కేటీఆర్ తో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఈఓ యంగ్చో చి సమావేశమయ్యారు. సమావేశ అనంతరం యంగ్చో చి…. తెలంగాణ రాష్ట్రం […]

KTR
X

తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ప్రతీ రోజూ పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు హ్యుండై గ్రూప్ ఈ రోజు ప్రకటించింది.

మంత్రి కేటీఆర్ తో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఈఓ యంగ్చో చి సమావేశమయ్యారు. సమావేశ అనంతరం యంగ్చో చి…. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్ లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. అంతే కాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామి అయ్యేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు.

1400 కోట్ల పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఇకో సిస్టమ్, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

దేశంలోనే మొదటిసారి ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చినందుకు హ్యుండై కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 1400 కోట్ల పెట్టుబడి పెడుతున్న హ్యుండై కంపెనీకి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

First Published:  26 May 2022 11:38 AM IST
Next Story