Telugu Global
NEWS

తెలంగాణలో ఫెర్రింగ్ ఫార్మా రెండో యూనిట్

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో తమ కార్యకలాపాలను మొదలు పెట్టిన కంపెనీలు మంత్రి కేటీఆర్ ని కలసి ధన్యవాదాలు చెప్పడంతోపాటు.. వ్యాపార విస్తరణకు కూడా తమ ప్రణాళికలను వివరిస్తున్నాయి. తాజాగా.. ఫెర్రింగ్ ఫార్మా సంస్థ తెలంగాణలో తమ రెండో యూనిట్ పెట్టేందుకు దావోస్ లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. మోర్ గుడ్ న్యూస్ ఫర్ తెలంగాణ.. తెలంగాణకు […]

తెలంగాణలో ఫెర్రింగ్ ఫార్మా రెండో యూనిట్
X

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో తమ కార్యకలాపాలను మొదలు పెట్టిన కంపెనీలు మంత్రి కేటీఆర్ ని కలసి ధన్యవాదాలు చెప్పడంతోపాటు.. వ్యాపార విస్తరణకు కూడా తమ ప్రణాళికలను వివరిస్తున్నాయి. తాజాగా.. ఫెర్రింగ్ ఫార్మా సంస్థ తెలంగాణలో తమ రెండో యూనిట్ పెట్టేందుకు దావోస్ లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.

మోర్ గుడ్ న్యూస్ ఫర్ తెలంగాణ..
తెలంగాణకు ఇది మరో పెద్ద శుభవార్త అంటూ కేటీఆర్ ఫెర్రింగ్ ఫార్మాతో ఒప్పందం కుదిరిన సందర్భంగా ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రెర్రింగ్‌ ఫార్మా రెండు నెలల క్రితం తెలంగాణలో ఫార్ములేటింగ్ సెంటర్ ని ప్రారంభించింది. కేటీఆర్ చేతుల మీదుగానే ఆ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు మరో సారి దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఫెర్రింగ్ ఫార్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండో ఫార్ములేటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ, తెలంగాణలోని మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కారణంగానే రెండో డీల్ సాధ్యమైందని వారు చెబుతున్నారు.

స్విట్జర్లాండ్ కి చెందిన ఫెర్రింగ్ ఫార్మా సంస్థను 1950లో ప్రారంభించారు. 110 రకాల ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది. 60 దేశాల్లో వీరి ఉత్పత్తులకు మార్కెట్ ఉంది. బాలింతలు, పురిటి బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను ఫెర్రింగ్ ఫార్మా తయారు చేస్తుంది. గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీకి సంబంధించిన మందులకు కూడా ఈ సంస్థ బాగా ఫేమస్. స్విట్జర్లాండ్ కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు అమెరికా, చైనా, భారత్ లో కూడా ఫార్ములేటింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో రెండో ఫార్ములేటింగ్ సెంటర్ కి దావోస్ లో ఒప్పందం కుదిరింది.

ALSO READ: ప్రధాని పర్యటన… హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే…

First Published:  25 May 2022 8:32 PM GMT
Next Story