నరేంద్ర మోదీ హెలీకాప్టర్ కు అనుమతి నిరాకరించిన ఏవియేషన్ అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తయ్యింది. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట విమానాశ్రయం వెళ్ళేందుకు ప్రయాణించాల్సిన హెలీకాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. ఐఎస్బీ నుంచి బేగంపేట వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ చెన్నై వెళ్ళాలి. అయితే ఒక్క సారిగా హైదారాబాద్ లో వాతావరణం మారిపోయింది. భారీగా ఈదురు గాలులు వీచాయి, పలు చోట్ల వర్షం కూడా పడింది. ఈ నేపథ్యంలో హెలీకాప్టర్ […]

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తయ్యింది. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట విమానాశ్రయం వెళ్ళేందుకు ప్రయాణించాల్సిన హెలీకాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. ఐఎస్బీ నుంచి బేగంపేట వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ చెన్నై వెళ్ళాలి.
అయితే ఒక్క సారిగా హైదారాబాద్ లో వాతావరణం మారిపోయింది. భారీగా ఈదురు గాలులు వీచాయి, పలు చోట్ల వర్షం కూడా పడింది. ఈ నేపథ్యంలో హెలీకాప్టర్ అనుమతి ఇవ్వడం కుదరదని ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు. దాంతో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గంలో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట చేరుకొని అక్కడి నుంచి చెన్నై బయలుదేరారు.