Telugu Global
NEWS

ఫ్రెంచ్ ఓపెన్లో అల్కారాజ్ గ్రేట్ ఎస్కేప్! నాలుగున్నర గంటల పోరులో నెగ్గిన యంగ్ గన్

ప్రపంచ పురుషుల టెన్నిస్ లో యువకెరటం, స్పానిష్ నయా బుల్ కార్లోస్ అల్కారాజ్ ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ గండం నుంచి గట్టెక్కి మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. మూడోసీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ సైతం మ్యాచ్ పాయింటు కాపాడుకొని మరీ 5 సెట్ల విజయంతో ఊపిరి పీల్చుకొన్నాడు. టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, 5వ సీడ్ రాఫెల్ నడాల్ మాత్రం రెండోరౌండ్లో అలవోక విజయాలతో మూడోరౌండ్లో అడుగుపెట్టారు. ఓటమి అంచుల నుంచి బయటపడి…. తన దేశానికే చెందిన ఆల్బెర్టో […]

ఫ్రెంచ్ ఓపెన్లో అల్కారాజ్ గ్రేట్ ఎస్కేప్! నాలుగున్నర గంటల పోరులో నెగ్గిన యంగ్ గన్
X

ప్రపంచ పురుషుల టెన్నిస్ లో యువకెరటం, స్పానిష్ నయా బుల్ కార్లోస్ అల్కారాజ్ ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ గండం నుంచి గట్టెక్కి మూడోరౌండ్లో అడుగుపెట్టాడు.

మూడోసీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ సైతం మ్యాచ్ పాయింటు కాపాడుకొని మరీ 5 సెట్ల విజయంతో ఊపిరి పీల్చుకొన్నాడు.

టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, 5వ సీడ్ రాఫెల్ నడాల్ మాత్రం రెండోరౌండ్లో అలవోక విజయాలతో మూడోరౌండ్లో అడుగుపెట్టారు.

ఓటమి అంచుల నుంచి బయటపడి….

తన దేశానికే చెందిన ఆల్బెర్టో రామోస్ వినోలాస్ తో జరిగిన రెండోరౌండ్ సమరంలో 19 ఏళ్ల కుర్రాడు, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ వారసుడు కార్లోస్ అల్కారాజ్..ఓటమి అంచుల నుంచి బయట పడి..ఆఖరిసెట్ ఆఖరిపాయింటు వరకూ పోరాడి విజేతగా నిలిచాడు.

మొత్తం 4 గంటల 35 నిముషాలపాటు సాగిన ఈ క్లేకోర్టు పోరులో అల్కారాజ్ 1-6, 7-6తో మొదటి రెండుసెట్లు చేజార్చుకొని ఓటమి అంచుల్లో పడిపోయాడు. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ ను 7-5తో నెగ్గడం ద్వారా ఊపిరిపీల్చుకొన్న అల్కారాజ్ చివరి రెండుసెట్లను 7-6, 6-4తో నెగ్గి మూడోరౌండ్లో అడుగుపెట్టాడు.

సుదీర్ఘపోరాటంలో తాను విజేతగా నిలిచినా పూర్తిగా అలసిపోయానని, తనలోని శక్తిఅంతా ఆవిరైపోయిందని మ్యాచ్ అనంతరం ఈ స్పానిష్ కుర్రోడు చెప్పాడు.

తర్వాతి రౌండ్లో అమెరికాకు చెందిన 27వ సీడ్ ఆటగాడు సెబాస్టియన్ కోర్డాతో అల్కారాజ్ తలపడనున్నాడు. ప్రస్తుత సీజన్లో అల్కారాజ్ ఆడిన గత 19 రౌండ్ల మ్యాచ్ ల్లో 18 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో నిలిచాడు.

అదే దారిలో జ్వరేవ్….

మరో యువఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ సైతం రెండోరౌండ్లో గట్టిపోటీ ఎదుర్కొని 2-6, 4-6, 6-1, 6-2, 7-5తో అర్జెంటీనా ఆటగాడు సెబాస్టియన్ బాజేను అధిగమించగలిగాడు.
ప్రీ-క్వార్టర్స్ లో చోటు కోసం జరిగే పోరులో అమెరికా ఆటగాడు బ్రెండన్ నకాషిమాతో జ్వరెవ్ తలపడనున్నాడు.

300 క్లబ్ లో రాఫెల్ నడాల్…

మరోవైపు…13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత , స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ రెండోరౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు కోరెంటీన్ మోటీని 6-3, 6-1, 6-4తో అలవోకగా ఓడించడం ద్వారా
మూడోరౌండ్ల అడుగుపెట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో 300 విజయాలు సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు.

స్విస్ వండర్ రోజర్ ఫెదరర్ 369, సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ 325 విజయాలతో మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు. 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నడాల్ మాత్రం 300 విజయాలతో మూడోస్థానంలో నిలిచాడు.

2005 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొంటూ వస్తున్న నడాల్ 107 విజయాలు, మూడంటే మూడే పరాజయాలతో ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు నమోదు చేశాడు.
మరో రెండోరౌండ్ పోరులో టాప్ సీడ్ జోకోవిచ్ 6-2, 6-3, 7-6తో స్లవేకియా ఆటగాడు అలెక్స్ మాల్కాన్ ను కంగు తినిపించాడు.

గత 17సంవత్సరాలుగా ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొంటూ వస్తున్న జోకోవిచ్ ఆఖరి 32 రౌండ్ కు 17వసారి చేరుకోగలిగాడు.

మూడోరౌండ్ పోరులో స్లవేనియాకే చెందిన అల్జాద్ బీడెన్ తో జోకో పోటీపడతాడు.

ALSO READ: రాహుల్ తీన్మార్ రికార్డు 15 మ్యాచ్ ల్లో 661 పరుగులు

First Published:  26 May 2022 8:47 AM IST
Next Story