Telugu Global
Others

త్వరగా సెటిల్ అవ్వడం కోసం జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు

రకరకాల కారణాల వల్ల చాలామందికి పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్‌ లాంటివి చదివే అవకాశం ఉండదు. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని ఇన్‌స్టంట్ జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించలేని వాళ్లు లేదా ఆర్ధిక స్థోమత లేని వాళ్లు ఏదో ఒకటి నేర్చుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వారు కొన్ని జాబ్ ఒరియెంటెడ్ కోర్సులను నేర్చుకుని, తగిన స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా […]

త్వరగా సెటిల్ అవ్వడం కోసం జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు
X

రకరకాల కారణాల వల్ల చాలామందికి పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్‌ లాంటివి చదివే అవకాశం ఉండదు. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని ఇన్‌స్టంట్ జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించలేని వాళ్లు లేదా ఆర్ధిక స్థోమత లేని వాళ్లు ఏదో ఒకటి నేర్చుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వారు కొన్ని జాబ్ ఒరియెంటెడ్ కోర్సులను నేర్చుకుని, తగిన స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఎంచుకున్న రంగంలో స్థిరపడొచ్చు. అలాంటి కోర్సులేంటంటే..

వ్యవసాయ రంగాన్ని ఇష్టపడే వాళ్లు టెన్త్ తర్వాత సెరీకల్చర్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌ వంటి విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులు, డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలు సాధించొచ్చు.

ఎస్‌ఈఓ
ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న రంగాల్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటి. ఈ డిజిటల్ మార్కెటింగ్‌కు ఆయువుపట్టు లాంటి సెర్చ్‌ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ గురించి నేర్చుకోవడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో మెరుగైన ఉద్యోగాలు సాధించొచ్చు.

హోటల్ మేనేజ్‌మెంట్
ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న రంగాల్లో హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగం కూడా ఒకటి. చెఫ్స్ నుంచి హోటల్ స్టాఫ్ వరకూ రకరకాల విభాగాల్లో హోటల్ మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ఆయా ఉద్యోగాలకు తగిన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో వీలైనంత త్వరగా సెటిల్ అవ్వొచ్చు.

స్టాక్‌ మార్కెట్
ఫైనాన్షియల్ రంగంలో ఆసక్తి ఉన్నవారు.. స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు చేయొచ్చు. లేదా నిపుణుల సాయంతో సొంతంగా వాటిపై నాలెడ్జిని పెంచుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా స్టాక్స్ లాంటి రంగాల్లో సొంతంగా రాణించే అవకాశముంది.

బ్యూటీ అండ్ ఫ్యాషన్
బ్యూటీ, ఫ్యాషన్, మేకప్, హెయిర్‌ డ్రెస్సింగ్‌ లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా బ్యూటీ, కాస్మొటిక్స్ రంగాల్లో వెంటనే సెటిల్ అయ్యే అవకాశముంటుంది. బ్యూటీ అండ్ కాస్మొటిక్స్ రంగంలో నిపుణులు అవ్వగలిగితే సొంతంగా కూడా రాణించొచ్చు.

ఇక వీటితో పాటు టైపింగ్, డీటీపీ, ఫొటోషాప్, ట్యాలీ, ఎంఎస్‌ ఆఫీస్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, వెబ్‌ డిజైనింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ వంటి విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేయడం ద్వారా పలురకాల సంస్థల్లో వెంటనే ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది.

First Published:  25 May 2022 3:22 PM IST
Next Story