అమలాపురంలో హై టెన్షన్.. ప్రజా ప్రతినిధుల తరలింపు..
అమలాపురం పట్టణంలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతకు ముందే కుటుంబ సభ్యులను అక్కడినుంచి తరలించారు. అల్లర్లతో స్థానిక ప్రజా ప్రతినిధులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆందోళనకారులు రాజకీయ నాయకుల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అందరినీ అమలాపురం దాటించేశారు. పట్టణంలో స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేకుండా చేశారు. మరోవైపు తెల్లవారు ఝాము వరకు అమలాపురంలో ఉద్రిక్తత కొనసాగుతూనే […]
అమలాపురం పట్టణంలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతకు ముందే కుటుంబ సభ్యులను అక్కడినుంచి తరలించారు. అల్లర్లతో స్థానిక ప్రజా ప్రతినిధులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆందోళనకారులు రాజకీయ నాయకుల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అందరినీ అమలాపురం దాటించేశారు. పట్టణంలో స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేకుండా చేశారు. మరోవైపు తెల్లవారు ఝాము వరకు అమలాపురంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు 144 సెక్షన్ విధించామని చెబుతున్నా ఆందోళనకారులు రోడ్లపైనే తిష్టవేశారు.
ఈ రోజు మళ్లీ ఆందోళన..
అమలాపురంలో ఆందోళనలు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో నిరసనకు కోనసీమ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ ఉదయం 10గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన పైకి భారీగా ప్రజలు చేరుకోవాలని, తమ ఆకాంక్షను ప్రభుత్వానికి వినిపించాలని సాధన సమితి నేతలు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హాజరవ్వాలని, వినతిపత్రాలు ఇవ్వాలని నేతలు పిలుపునివ్వగా.. పోలీసులు ఎక్కడివారినక్కడే అడ్డుకున్నారు. అయితే మంగళవారం ఉద్యమకారులంతా రోడ్డెక్కారు. ఇప్పుడు బుధవారం కూడా దీన్ని కొనసాగించబోతున్నారు.
పోలీసుల సంయమనం..
కోనసీమ జిల్లా వివాదంపై పోలీసులు కఠినంగా వ్యవహరించ లేదని సాక్షాత్తూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. పోలీసులపై దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే అమలాపురం ఉద్రిక్తతల విషయంలో పోలీసులు సంయమనం పాటిస్తున్నారని తెలుస్తోంది. 144 సెక్షన్ అప్పటికే అమలులో ఉన్నా కూడా అమలాపురంలో వేలాదిమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. వారిని అదుపు చేయడం జిల్లా పోలీస్ యంత్రాంగానికి సాధ్యం కాలేదు. ఆందోళనలు హద్దుమీరడంతో ఇప్పుడు పక్క జిల్లాలనుంచి కూడా బలగాలను పిలిపిస్తున్నారు. జిల్లా మొత్తం నిఘా పెట్టారు. ఈరోజు నల్ల వంతెన దగ్గర జరికే ఆందోళనను అడ్డుకునేందుకు ముందుగానే సిద్ధమయ్యారు. రాత్రి నుంచి అమలాపురం పట్టణంలో కరెంటు నిలిపివేశారు. బందోబస్తు పెంచారు. ఆందోళనకారుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానం అటు పోలీసుల్లో, ఇటు ఆందోళనకారుల్లోనూ ఉంది.