Telugu Global
International

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత -19 మంది చిన్నారులను కాల్చి చంపిన దుండగుడు

అమెరికాలోని టెక్సాస్ నగరం మారో సారి కాల్పుల మోతతో హోరెత్తింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన ఓ టీనేజ్ ముష్కరుడు కనీసం 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దవారిని హతమార్చాడు. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటన‌గా రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు. ఆంటోనియోకు పశ్చిమాన 130 కిమీ దూరంలో ఉన్న టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో మంగళవారం ఉదయం అటోమేటిక్ రైఫిల్ తో ప్రవేశించిన 18 […]

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత -19 మంది చిన్నారులను కాల్చి చంపిన దుండగుడు
X

అమెరికాలోని టెక్సాస్ నగరం మారో సారి కాల్పుల మోతతో హోరెత్తింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన ఓ టీనేజ్ ముష్కరుడు కనీసం 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దవారిని హతమార్చాడు. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటన‌గా రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు.

ఆంటోనియోకు పశ్చిమాన 130 కిమీ దూరంలో ఉన్న టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో మంగళవారం ఉదయం అటోమేటిక్ రైఫిల్ తో ప్రవేశించిన 18 ఏళ్ళ సాల్వడార్ రామోస్ అనే ముష్కరుడు పిల్లలపై కాల్పులకు త్రెగబడ్డాడు. 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.చనిపోయిన పిల్లల వయసు ఏడేళ్ళనుండి పదేళ్ళ మధ్య ఉంటుంది.

మరో పది మంది దాకా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ… రాజకీయంగా శక్తివంతమైన US తుపాకీ లాబీకి వ్యతిరేకంగా నిలబడాలని అమెరికన్లను కోరారు.

కాగా 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్‌ విద్యార్థులతో సహా ముగ్గురు టీచర్లు మృతిచెందారు. ఈ ఘటన తర్వాత అమెరికాలో ఇదే అత్యంత దారుణ సంఘటనగా పోలీస్ అధికారులు తెలిపారు.

First Published:  24 May 2022 10:49 PM GMT
Next Story