మొండిగా నిలబడ్డ గన్‌మెన్..
అమలాపురంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై ఒక్కసారిగా ఆందోళనకారులు దాడి చేశారు. నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా దాదాపు వెయ్యి మంది ఆందోళన కారులు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ఇంటికి ఎదురుగానే ఇటుకల కుప్ప ఉండడంతో వాటిని తీసుకుని యదేచ్చగా ఎమ్మెల్యే ఇంటిపైకి విసిరారు. దాంతో ఇంటి అద్దాలు మొత్తం ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు ఇంటిలోకి చొరబడి అక్కడే ఉన్న రెండు బైకులు, ఒక స్కూటర్‌కు నిప్పు పెట్టారు. అక్కడున్న పోలీసులు […]
అమలాపురంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై ఒక్కసారిగా ఆందోళనకారులు దాడి చేశారు. నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా దాదాపు వెయ్యి మంది ఆందోళన కారులు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు.
ఎమ్మెల్యే ఇంటికి ఎదురుగానే ఇటుకల కుప్ప ఉండడంతో వాటిని తీసుకుని యదేచ్చగా ఎమ్మెల్యే ఇంటిపైకి విసిరారు. దాంతో ఇంటి అద్దాలు మొత్తం ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు ఇంటిలోకి చొరబడి అక్కడే ఉన్న రెండు బైకులు, ఒక స్కూటర్‌కు నిప్పు పెట్టారు. అక్కడున్న పోలీసులు వద్ద లాఠీలు మాత్రమే ఉండడంతో వారూ ఏమీ చేయలేకపోయారు.
దాడి జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే, ఆయన భార్య.. పైఅంతస్తులో ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న అనుచరులనూ ఆందోళనకారులు కొట్టారు. పెట్రోల్ క్యాన్లతో పైఅంతస్తులోకి వెళ్లేందుకు ఆందోళన కారులు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే గన్‌మెన్ ప్రతిఘటించారు. మెట్లపై నిలబడిన గన్‌మెన్.. పైకి వస్తే కాల్చేస్తానని గట్టిగా హెచ్చరించడంతో పైఅంతస్తులోకి ఆందోళనకారులు వెళ్లలేకపోయారు. ఇంతలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని గాల్లోకి కాల్పులు మొదలుపెట్టడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు.
వెంటనే పైఅంతస్తుకు వెళ్లి ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పోలీసులు కిందకు తీసుకొచ్చి పక్కింటిలో ఉంచారు. పోలీసులు రాకపోయినా, గన్‌మెన్ అడ్డుపడకపోయినా ఎమ్మెల్యేతో పాటు అందరం సజీవదహనం అయ్యేవారమని ప్రత్యక్షసాక్ష్యాలు వివరించారు.
తాము పుట్టినప్పటి నుంచి అమలాపురంలో ఈ తరహా దాడులను ఎన్నడూ చూడలేదని ఎమ్మెల్యే సతీష్ సోదరుడు వివరించారు. పోలీసులు లేకుంటే తాము ప్రాణాలతో బయటపడేవారం కాదన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి కూడా భారీ నష్టం జరిగిందని ఎమ్మెల్యే సోదరుడు వివరించారు. మంత్రి ఇంటి వద్ద కోటి రూపాయల ఆస్తినష్టం జరిగిందని.. దగ్ధమైన కలప మెటిరియల్ విలువే 25 లక్షల వరకు ఉందని వెల్లడించారు.
ALSO READ: వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు