Telugu Global
NEWS

చంద్రబాబుది రాజకీయ అక్కసు..

కొవిడ్‌ కష్టకాలంలో సంక్షేమ పథకాల సాయంతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం విడ్డూరం అని అన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. లాక్‌ డౌన్లతో ఆదాయం పడిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారాయన. మాజీ ఆర్థిక మంత్రి, మేధావిగా చలామణి అయ్యే యనమల.. కొవిడ్‌ కాలాన్ని సాధారణ సంవత్సరాలతో పోల్చడం.. ప్రజలని తప్పుదోవ పట్టించడమేనన్నారు బుగ్గన. ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అసంబద్ధమైనవని కొట్టిపారేశారు బుగ్గన. రాజకీయ అక్కసు.. చంద్రబాబు […]

చంద్రబాబుది రాజకీయ అక్కసు..
X

కొవిడ్‌ కష్టకాలంలో సంక్షేమ పథకాల సాయంతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం విడ్డూరం అని అన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. లాక్‌ డౌన్లతో ఆదాయం పడిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారాయన. మాజీ ఆర్థిక మంత్రి, మేధావిగా చలామణి అయ్యే యనమల.. కొవిడ్‌ కాలాన్ని సాధారణ సంవత్సరాలతో పోల్చడం.. ప్రజలని తప్పుదోవ పట్టించడమేనన్నారు బుగ్గన. ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అసంబద్ధమైనవని కొట్టిపారేశారు బుగ్గన.

రాజకీయ అక్కసు..
చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదని, వారికి చేసిన మేలు ఏమీ లేదన్నారు బుగ్గన. వైసీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేస్తున్నామని, గడప గడప కార్యక్రమంలో తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక శ్రీలంక.. శ్రీలంక.. అంటూ చంద్రబాబు గావుకేకలు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు శ్రీలంక పరిణామాలకు, మనకు పోలికేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ అక్కసుతో చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు బుగ్గన.

ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందన్న ఆరోపణల్లో వాస్తవంలేదని అన్నారు బుగ్గన. వైసీపీ కంటే టీడీపీ హయాంలోనే అప్పుల్లో వృద్ధిరేటు ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి, ప్రజల సొమ్మును కాజేసి జేబులు నింపుకున్న టీడీపీ నాయకులవల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని చెప్పారు. టీడీపీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణను పక్కనపెట్టడం వల్లే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని, ఇప్పుడు ఆ తప్పులన్నిటినీ తాము సరిదిద్దుతున్నామని, ఈ క్రమంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.

ఆహార భద్రతా చట్టం పరిధిలోకి ఏపీలో ఉన్న అన్ని రేషన్ కార్డులను తీసుకు రావడంలో గత ప్రభుత్వం విఫలమైందని, మిగిలినవాటికి సబ్సిడీ ఖర్చుని తమ ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని చెప్పారు బుగ్గన. విద్యుత్‌ సంస్థల అప్పులను టీడీపీ రెండింతలు పెంచిందని, ఆ భారమంతా వైసీపీ సర్కారుపై పడిందని వివరించారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సమయంలో ఉద్యోగుల జీతాల కష్టాలు మొదలయ్యాయని, తమ హయాంలో వాటిని సరిచేస్తున్నామని చెప్పారు. ఇలాంటి విషయాల్లో కూడా తమపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

First Published:  24 May 2022 8:20 PM GMT
Next Story