స్పానిష్ బుల్ గ్రాండ్ షో..!
క్లేకోర్టు టెన్నిస్ లో మొనగాడు, గ్రాండ్ స్లామ్ కింగ్ , స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఎవర్ గ్రీన్ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు. 13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నడాల్.. ప్రస్తుత 2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో 5వ సీడ్ ఆటగాడిగా రికార్డుస్థాయిలో 14వ టైటిల్ కోసం బరిలో నిలిచాడు. తొలిరౌండ్ విజయంతో బోణీ కొట్టడమే కాదు..గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ […]
క్లేకోర్టు టెన్నిస్ లో మొనగాడు, గ్రాండ్ స్లామ్ కింగ్ , స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఎవర్ గ్రీన్ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు. 13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నడాల్.. ప్రస్తుత 2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో 5వ సీడ్ ఆటగాడిగా రికార్డుస్థాయిలో 14వ టైటిల్ కోసం బరిలో నిలిచాడు. తొలిరౌండ్ విజయంతో బోణీ కొట్టడమే కాదు..గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెదరర్ రికార్డును అధిగమించాడు.
300 విజయాలకు చేరువగా..
ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ పోరులో ఫ్రెంచ్ అన్ సీడెడ్ ఆటగాడు కోరింటిన్ మ్యూటియర్ ను వరుస సెట్లలో 6-2, 6-2, 6-2తో చిత్తు చేయడం ద్వారా రెండో రౌండ్ కు అర్హత సంపాదించాడు. ఈ క్రమంలో నడాల్ 299వ సింగిల్స్ విజయం నమోదు చేశాడు. ఒకే గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఇప్పటి వరకూ అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడి రికార్డు రోజర్ ఫెదరర్ పేరుతో ఉంది.
వింబుల్డన్ టోర్నీలలో ఫెదరర్ 105 విజయాలు నమోదు చేశాడు. అయితే నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ లో 106వ విజయం సాధించడం ద్వారా ఫెదరర్ రికార్డును దాటిపోయాడు. అమెరికన్ దిగ్గజం జిమ్మీ కానర్స్ యూఎస్ ఓపెన్లో 98 విజయాలు సాధించడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్ల జాబితా మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా గ్రాండ్ స్లామ్ ( ఫ్రెంచ్, వింబుల్డన్, అమెరికన్, ఆస్ట్ర్రేలియన్ ) ఓపెన్ టోర్నీలలో నడాల్ కు ఇది 299వ సింగిల్స్ గెలుపు కావడం మరో రికార్డు.
ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ రెండోరౌండ్లో నడాల్ నెగ్గితే 300 విజయాల ఫెదరర్ రికార్డును సమం చేయగలుగుతాడు. తరచూ గాయాలపాలు కావడం, వయసు మీరడంతో జోరు తగ్గిన నడాల్ ప్రస్తుత సీజన్ లో తన అడ్డా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేట తొలిపోరులో సంపూర్ణఆధిక్యం ప్రదర్శించాడు.27 విన్నర్స్ తో చెలరేగిపోయాడు.
బేస్ లైన్ లో 27 పాయింట్లు, నెట్ గేమ్ లో 12 పాయింట్లు సాధించడం ద్వారా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, గాయాల ప్రభావమూ లేదని తేల్చి చెప్పాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యధికంగా 13 టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా నడాల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.