ఐపీఎల్ లో సిక్సర్ల హోరు...బౌండ్రీల జోరు, వెయ్యి సిక్సర్లతో సరికొత్త రికార్డు
ఐపీఎల్ 15వ సీజన్ తొలిఅంచెగా జరిగిన 70 లీగ్ మ్యాచ్ లు…సిక్సర్ల హోరు, బౌండ్రీల జోరుతో పాటు రికార్డుల మోతతో ముగిసింది. గత ఏడువారాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తూ వచ్చిన ఈ లీగ్ లో వివిధజట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటు ఉన్నది బాదటానికే అన్నట్లుగా..భారీషాట్లతో పరుగుల వెల్లువెత్తించారు. సిక్సర్ల బాదుడులో రాయల్స్ టాప్… ప్రస్తుత సీజన్ లీగ్ దశలో అత్యధిక సిక్సర్లు బాదినజట్టుగా మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. లీగ్ […]
ఐపీఎల్ 15వ సీజన్ తొలిఅంచెగా జరిగిన 70 లీగ్ మ్యాచ్ లు…సిక్సర్ల హోరు, బౌండ్రీల జోరుతో పాటు రికార్డుల మోతతో ముగిసింది. గత ఏడువారాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తూ వచ్చిన ఈ లీగ్ లో వివిధజట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటు ఉన్నది బాదటానికే అన్నట్లుగా..భారీషాట్లతో పరుగుల వెల్లువెత్తించారు.
సిక్సర్ల బాదుడులో రాయల్స్ టాప్…
ప్రస్తుత సీజన్ లీగ్ దశలో అత్యధిక సిక్సర్లు బాదినజట్టుగా మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ మొత్తం 14 మ్యాచ్ ల్లో 116 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలించింది.
113 సిక్సర్లతో కోల్ కతా నైట్ రెండర్స్ రెండు, 110 సిక్సర్లతో పంజాబ్ కింగ్స్ మూడు, 106 సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు, 103 సిక్సర్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు స్థానాలలో ఉన్నాయి.
101 సిక్సర్లతో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు, 100 సిక్సర్లతో ముంబై ఇండియన్స్ ఏడు, 97 సిక్సర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది, 86సిక్సర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 స్థానాలలో నిలిచాయి.
జోస్…సిక్సర్ల జోష్….
ఇక..సిక్సర్ల బాదుడులో వ్యక్తిగత రికార్డును సైతం రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సొంతం చేసుకొన్నాడు. బట్లర్ మొత్తం 14 మ్యాచ్ ల్లో 37 సిక్సర్లు బాదాడు.
పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ లైమ్ లివింగ్ స్టోన్, ఆండ్రే రస్సెల్, కేఎల్ రాహుల్, రోవ్‌మన్ పావెల్ ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు. లివింగ్ స్టోన్ 34, ఆండ్రే రస్సెల్ 32, కేఎల్ రాహుల్ 25, రోవ్‌మన్ పావెల్ 22 సిక్సర్లు బాదిన మొనగాళ్లుగా నిలిచారు.
మ్యాచ్ కు సగటున 14 సిక్సర్లు..
ముంబై లోని మూడు ( వాంఖడే, డీవై పాటిల్, బ్రబర్న్ ) స్టేడియాలతో పాటు పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియాలలో మాత్రమే మొత్తం 70 లీగ్ మ్యాచ్ లూ నిర్వహించారు.
ఈ 70 మ్యాచ్ ల్లో సగటున 14కి పైగా సిక్సర్లు నమోదయ్యాయి. ఫ్లే ఆఫ్స్ నుంచి ఫైనల్స్ వరకు జరిగే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించగలిగితే.. సిక్సర్ల సంఖ్య 1050 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వెయ్యి సిక్సర్లు…ఇదే తొలిసారి…
ఐపీఎల్ అంటేనే బాదుడు, వీరబాదుడు. ప్రస్తుత సీజన్ మొదటి 70 మ్యాచ్ ల్లోనే 1000 సిక్సర్ల రికార్డును తాకడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.
ప్రస్తుత సీజన్ లీగ్ దశ ఆఖరిమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన పోరులో కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లు 15 సిక్సర్లు బాదారు. ఇంతకుముందు 2018 ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 872 సిక్స్‌లు , 2019లో 784, 2020లో 734 సిక్సర్లు చొప్పున రికార్డుల్లో చేరాయి.
రాబిన్ ఊతప్ప నుంచి లివింగ్ స్టోన్ వరకూ…
2022 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో తొలి సిక్సర్ బాదిన ఘనతను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప దక్కించుకొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముగిసిన మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతిని ఊతప్ప సిక్సర్ గా మలిచాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ..షెపర్డ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతిని లివింగ్ స్టోన్ సిక్సర్ కొట్టడం ద్వారా 1000 సిక్సర్ల మైలురాయి నమోదయ్యింది. వెయ్యో సిక్సర్ బాదిన ఆటగాడి ఘనతను లివింగ్ స్టోన్ సొంతం చేసుకోగలిగాడు.
బౌండ్రీల కింగ్ శిఖర్ ధావన్…
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 700 బౌండ్రీలు సాధించిన బ్యాటర్ రికార్డును కింగ్స్ పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సాధించాడు.
ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్త్ తో ముగిసిన చివరి రౌండ్ మ్యాచ్‌లో ధావన్ 700వ బౌండ్రీని నమోదు చేశాడు. శిఖర పేరిట ఐపీఎల్‌లో మొత్తం 701 బౌండ్రీల రికార్డు ఉంది.
ధావన్ తర్వాత జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ప్రస్తుత సీజన్ వరకూ వార్నర్ 577, కోహ్లీ 576 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండవ బ్యాటర్‌గా కూడా శిఖర్ ధావన్ పేరుతోనే 6244 పరుగుల రికార్డు నమోదయ్యింది.
– 69 : గుజరాత్ టైటాన్స్