కుతుబ్ మినార్ వద్ద ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు
కుతుబ్ మినార్ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను భారత పురావస్తు శాఖ (ASI) తిరస్కరించింది. కుతుబ్ మినార్ హిందువులదని అక్కడ ఆలయాన్ని పునరుద్ధరించాలని, పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సాకేత్ కోర్టులో నడుస్తున్న కేసులో మంగళవారం ASI అఫిడవుట్ ను దాఖలు చేసింది. 1914 నుంచి కుతుబ్ మినార్ పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోందని, అలాంటి చోట నిర్మాణాలను మార్చడం కానీ, ఆరాధన పునరుద్ధరణ కానీ అనుమతించబడదు అని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది. ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం కుతుబ్ […]
కుతుబ్ మినార్ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను భారత పురావస్తు శాఖ (ASI) తిరస్కరించింది. కుతుబ్ మినార్ హిందువులదని అక్కడ ఆలయాన్ని పునరుద్ధరించాలని, పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సాకేత్ కోర్టులో నడుస్తున్న కేసులో మంగళవారం ASI అఫిడవుట్ ను దాఖలు చేసింది.
1914 నుంచి కుతుబ్ మినార్ పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోందని, అలాంటి చోట నిర్మాణాలను మార్చడం కానీ, ఆరాధన పునరుద్ధరణ కానీ అనుమతించబడదు అని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.
ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం కుతుబ్ మినార్ దగ్గర పూజలకే కాదు నమాజ్ లకు కూడా అనుమతి లేదని ASI తేల్చి చెప్పింది.
జైన దేవుడు తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణువు తరపున న్యాయవాదులు హరి శంకర్ జైన్ , రంజన అగ్నిహోత్రి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వివాదానికి దారితీయడంతో సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇప్పటి వరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
ఈ వివాదం తర్వాత ఆ స్థలాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, పలువురు ASI అధికారుల బృందం సందర్శించింది, దాంతో మరిన్ని పుకార్లు వ్యాపించాయి.
మరో వైపు జ్ఞానవాపి మసీదు వివాదం నేపథ్యంలో హిందూ సంఘాలు కుతుబ్ మినార్ ను కూడా వివాదం చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అంతే కాకుండా కుతుబ్ మినార్‌ను కుతుబ్ అల్ దిన్ ఐబక్ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని ASI మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ చెప్పడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. దాంతో ఇప్పుడు కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.