Telugu Global
NEWS

ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP) ని అమలులోకి తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కారణంగా కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు, యూనివర్సిటీలు మాత్రం తమ విచక్షణ మేరకు ఈ సిస్టమ్ అమలు చేస్తున్నాయి. తెలంగాణలో అత్యంత పేరున్న విశ్వవిద్యాలయం ఉస్మానియాలో మాత్రం ఎన్ఈపీని పూర్తి స్థాయిలో అమలు చేయబోమని వైస్ ఛాన్సలర్ డి. రవీందర్ […]

ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్
X

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP) ని అమలులోకి తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కారణంగా కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు, యూనివర్సిటీలు మాత్రం తమ విచక్షణ మేరకు ఈ సిస్టమ్ అమలు చేస్తున్నాయి. తెలంగాణలో అత్యంత పేరున్న విశ్వవిద్యాలయం ఉస్మానియాలో మాత్రం ఎన్ఈపీని పూర్తి స్థాయిలో అమలు చేయబోమని వైస్ ఛాన్సలర్ డి. రవీందర్ పోయిన శనివారం మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో క్లస్టర్ విధానాన్ని మాత్రం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ అకడమిక్ ఇయర్ (2022-23) నుంచి విద్యార్థులకు ఈ క్లస్టర్ విధానం అందుబాటులోనికి రానున్నది. దీంతో ఏ విద్యార్థి అయినా ఒక ఏడాది ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత… తనకు నచ్చితే మరో కళాశాలకు మారే అవకాశం ఉంటుంది. తాను మొదట జాయిన్ అయిన కాలేజీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ లేకపోతే.. పూర్తిగా కాలేజీ మారకుండా.. కేవలం తనకు కావల్సిన సబ్జెక్ట్ కోసం వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది ఒక సెమిస్టర్ కాలపరిమితికి లేదా పూర్తిగా మూడేళ్లకు సదరు విద్యార్థి ఉపయోగించుకునే వీలుంది. అయితే చివరకు మాత్రం.. మొదట ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుంటే అదే కాలేజీ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

కాగా, రాబోయే విద్యాసంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కాలేజీలను క్లస్టర్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. సోమవారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ సంతకాలు చేశారు.

ఈ అకడమిక్ ఇయర్‌లో సెయింట్ ఆన్స్ (మెహిదీపట్నం), లయోలా అకాడమీ (సికింద్రాబాద్), సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సెయింట్ ఫ్రాన్సిన్స్ ఉమెన్స్ కాలేజ్, ఆర్‌బీవీవీఆర్ఆర్ కాలేజ్, భవన్స్ వివేకానంద కాలేజ్, నిజం కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్, బేగంపేట ఉమెన్స్ కాలేజీ ఈ క్లస్టర్ పరిధిలోకి వచ్చాయి. ఈ కాలేజీల్లో జాయిన్ అయిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను ఎంచుకొని ఎక్కడైనా చదువకునే వెసులుబాటు ఉంటుంది.

First Published:  24 May 2022 2:47 AM IST
Next Story