పంజాబ్ సీఎం సంచలన నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రశంసలు..!
అవినీతి కట్టడిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను ఆయన పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సీఎం భగవంత్ సింగ్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను భర్తరఫ్ చేశారు. విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. […]
అవినీతి కట్టడిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను ఆయన పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సీఎం భగవంత్ సింగ్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను భర్తరఫ్ చేశారు.
విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఆరోగ్యశాఖ మంత్రి వివిధ పనుల కోసం కాంట్రాక్టర్ల నుంచి 1 % కమీషన్ వసూలు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో అతడిని పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పంజాబ్ సీఎం తీసుకున్న నిర్ణయంపై తాజాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. అవినీతికి పాల్పడ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించడంపై సీఎం భగవత్ మాన్ ను ప్రశంసించారు. ‘ భగవత్ మీరు చేసిన పనికి గర్వపడుతున్నా. నాకు కన్నీళ్లను తెప్పించింది. ఈ రోజు దేశం మొత్తం ఆప్ తీసుకున్న నిర్ణయంపై గర్విస్తోంది.’ అని అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొన్న తొలినాళ్లలో ఓ మంత్రి అవినీతికి పాల్పడగా ఆయనను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు