Telugu Global
International

పుతిన్ పై హత్యా యత్నం ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై మరో సారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దాన్నించి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో ఈ హత్యాయత్నం జరగడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ఉక్రెయిన్ మిలటరీ అధికారే బైటపెట్టారు. నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఆదాడి నుంచి ఆయన సురక్షితంగా బైటపడ్డాడని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్ […]

పుతిన్ పై హత్యా యత్నం ?
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై మరో సారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దాన్నించి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో ఈ హత్యాయత్నం జరగడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ఉక్రెయిన్ మిలటరీ అధికారే బైటపెట్టారు.

నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఆదాడి నుంచి ఆయన సురక్షితంగా బైటపడ్డాడని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్ ఓ ప్రకటన చేశారు.

స్కై న్యూస్ ఇంటర్వ్యూలో జనరల్‌ కైర్య్లో బుడానోవ్ ఈ విషయాలు బైటపెట్టాడని ‘ఉక్రెయిన్‌స్కా ప్రవ్దా’ తెలిపింది. ”కాకసస్ ప్రాంతంలో పర్యటనలో ఉండగా పుతిన్ పై దాడి జరిగింది. అయితే ఇది జరిగి రెండు నెలలు అవుతుంది” అని బుడానోవ్ చెప్పారు. ”పుతిన్ పై హత్యా యత్నం మరో సారి విఫలమైంది. దీని గురించి ఎక్కడా ప్రచారం జరగలేదు కానీ ఈ స‍ంఘటన జరిగింది మాత్రం నిజం” అని బుడానోవ్ అన్నారు.

రష్యా అధ్యక్షుడయ్యాక పుతిన్ పై 5 సార్లు హత్యా యత్నాలు జరిగాయి. ఇప్పుడు బుడానోవ్ చెప్తున్నది కూడా నిజమే అయితే ఇది ఆరో సారి. పుతిన్ అత్యంత భద్రతా వలయంలో ఉన్నప్పటికీ తన రక్షణ విషయంలో పెద్దగా జాగ్రత్తలు పాటించడని రష్యన్ అధికారులు చెప్తుంటారు.

First Published:  24 May 2022 11:42 AM IST
Next Story