అల్లర్ల వెనుక జనసేన " హోంమంత్రి.. ఖండించిన పవన్
అమలాపురం అల్లర్లు వెనుక టీడీపీ, జనసేన హస్తముందని ఆరోపించారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. అల్లర్లు చేసే వారి వెనుక ఎవరున్నారో కూడా గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అల్లర్ల వెనుక జనసేన హస్తం కూడా ఉందని […]
అమలాపురం అల్లర్లు వెనుక టీడీపీ, జనసేన హస్తముందని ఆరోపించారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు.
అల్లర్లు చేసే వారి వెనుక ఎవరున్నారో కూడా గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
అల్లర్ల వెనుక జనసేన హస్తం కూడా ఉందని హోంమంత్రి ఆరోపించడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. అమలాపురంలో నెలకొన్న పరిస్థితులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. అంబేద్కర్ పేరును వివాదానికి కేంద్రబిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలను పరిరక్షించడంలో వైఫల్యం చెంది… వాటిని ఇతర పార్టీలకు ఆపాదిస్తున్నారని విమర్శించారు. బాధ్యత కలిగిన హోంమంత్రి తన ప్రకటనలో జనసేన పేరును ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను జనసేనపై రుద్దవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.