Telugu Global
CRIME

నేరం అంగీకరించిన ఎమ్మెల్సీ? హత్యకు కారణం అదే

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైడ్రామా నడుమ ఆయన కాకినాడ పోలీసుల ముందు లొంగిపోయారు. పోస్టుమార్టంలో సుబ్రహ్మణ్యంది హత్యే అని తేలడంతో ఎమ్మెల్సీ లొంగిపోకతప్పలేదు. పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు తన నేరాన్ని అంగీరించినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత అంశాల్లోకి జోక్యం చేసుకోవడం, తన రహస్యాలను బయటపెట్టే ప్రయత్నం చేయడం, వాటి గురించి పలువురి వద్ద మాట్లాడుతున్నందునే సుబ్రహ్మణ్యంపై దాడి చేసినట్టు అనంతబాబు అంగీకరించారని సమాచారం. అయితే తనకు […]

నేరం అంగీకరించిన ఎమ్మెల్సీ? హత్యకు కారణం అదే
X

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైడ్రామా నడుమ ఆయన కాకినాడ పోలీసుల ముందు లొంగిపోయారు. పోస్టుమార్టంలో సుబ్రహ్మణ్యంది హత్యే అని తేలడంతో ఎమ్మెల్సీ లొంగిపోకతప్పలేదు.

పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు తన నేరాన్ని అంగీరించినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత అంశాల్లోకి జోక్యం చేసుకోవడం, తన రహస్యాలను బయటపెట్టే ప్రయత్నం చేయడం, వాటి గురించి పలువురి వద్ద మాట్లాడుతున్నందునే సుబ్రహ్మణ్యంపై దాడి చేసినట్టు అనంతబాబు అంగీకరించారని సమాచారం. అయితే తనకు హత్య చేసే ఉద్దేశం లేదని, కేవలం బెదరగొట్టడం కోసమే దాడి చేశానని, మద్యం మత్తులో దెబ్బలు గట్టిగా కొట్టానని దాంతో సుబ్రహ్మణ్యం చనిపోయారని పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని జిల్లా పోలీసులు తెలిపారు.

అటు మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఈ అంశంపై స్పందించారు. అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. 302 సెక్షన్ కింద కేసు కూడా నమోదు అయిందన్నారు. పార్టీ నుంచి అతడిని సస్పెండ్ చేస్తారా అన్న ప్రశ్నకు.. అది తర్వాతి అంశమని బొత్స వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. అటు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ కేసులోనే విచారిస్తున్నారు.

ALSO READ: అనంతబాబు అరాచకాల చిట్టా.. మచ్చుకు కొన్ని

First Published:  23 May 2022 1:23 PM IST
Next Story