Telugu Global
NEWS

షాప్ కీపర్ కు మోదీకి లింకేంటి ? కేటీఆర్ చెప్పిన ఆసక్తిదాయకమైన కథ‌

తాజాగా కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై స్వల్పంగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా రాష్ట్రాలు కూడా తమ పన్నులు తగ్గించుకోవాలని సూచించింది కేంద్రం. మరో వైపు కేంద్రం చర్యపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తి దాయకంగా స్పందించారు. ఈ అంశంపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ… నా పాఠశాల పక్కన ఉన్న […]

ktr, modi
X

తాజాగా కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై స్వల్పంగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా రాష్ట్రాలు కూడా తమ పన్నులు తగ్గించుకోవాలని సూచించింది కేంద్రం. మరో వైపు కేంద్రం చర్యపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తి దాయకంగా స్పందించారు.

ఈ అంశంపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ… నా పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణదారుడు పీక్ సీజన్‌లో ధరలను 300% పెంచి, ఆపై ప్రజలను మోసం చేయడానికి, దానిని 30% తగ్గించేవాడు. అతని సన్నిహితులేమో ఆ 30 శాతం తగ్గింపును బంపర్ ఆఫర్‌గా అభివర్ణించడం ప్రారంభించి, అతనికి ధన్యవాదాలు తెలిపేవాళ్ళు!

ఇది తెలిసిన కథలాగే అనిపిస్తోందా ? అసలు ధరలు పెంచింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

కేటీఆర్ ట్వీట్ కు నెటిజనులు భారీగానే స్పందించారు. ఆ దుకాణదారుడెవరో తమ‌కు తెలుసని ఒకరు, ఇంకెవరు మోదీయే అని మరొకరు స్పందించారు.

మరో వైపు రాష్ట్రాలు పెట్రోల్ , డీజిల్ పై పన్నులు తగ్గించాలన్న కేంద్రం సూచనకు బీజేపీ యేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. తాము పెట్రోల్ , డీజిల్ పై ఎన్నడూ పన్నులు పెంచలేదని, కాబట్టి తగ్గించాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేయగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే మాట చెబుతోంది.

First Published:  23 May 2022 6:05 AM IST
Next Story