Telugu Global
National

వార్ని.. ఓటేయడానికి బికినీలు, అండర్‌వేర్లలో వచ్చిన ఆస్ట్రేలియన్లు.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

ఎన్నికలంటే రాజకీయ పార్టీల, అభ్యర్థుల హడావిడి చూస్తుంటాము. గెలవడానికి అనేక రకాల వ్యూహాలు పన్నుతుంటారు. అలాగే ఓటర్లను ఆకర్షించడానికి హామీలు గుప్పించడమే కాకుండా, పోలింగ్ రోజు తాయిలాలు కూడా ఇస్తుంటారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారీగా ప్రచారం చేస్తుంటుంది. ఓటర్లకు అవగాహన కల్పించడానికి అనేక మాధ్యమాలను ఉపయోగిస్తుంటుంది. ఇంత కష్ట పడినా ఓట్లు వేయడానికి ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే. ఆస్ట్రేలియాలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా తరలి […]

వార్ని.. ఓటేయడానికి బికినీలు, అండర్‌వేర్లలో వచ్చిన ఆస్ట్రేలియన్లు.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
X

ఎన్నికలంటే రాజకీయ పార్టీల, అభ్యర్థుల హడావిడి చూస్తుంటాము. గెలవడానికి అనేక రకాల వ్యూహాలు పన్నుతుంటారు. అలాగే ఓటర్లను ఆకర్షించడానికి హామీలు గుప్పించడమే కాకుండా, పోలింగ్ రోజు తాయిలాలు కూడా ఇస్తుంటారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారీగా ప్రచారం చేస్తుంటుంది. ఓటర్లకు అవగాహన కల్పించడానికి అనేక మాధ్యమాలను ఉపయోగిస్తుంటుంది. ఇంత కష్ట పడినా ఓట్లు వేయడానికి ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే.

ఆస్ట్రేలియాలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. ఎన్నడూ లేనంతగా పోలింగ్ స్టేషన్ల ముందు ఓటర్లు బారులు తీరడం ఒకవైపు సంతోషాన్ని కలిగించినా.. వారిలో చాలా మంది లో దుస్తుల్లో ఓట్లేయడానికి రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆడామగా తేడా లేకుండా అందరూ బికినీలు, అండర్ వేర్లలో పోలింగ్ బూత్‌ల ముందు క్యూ కట్టారు. ఏంటీ.. వీళ్లంతా నిరసన తెలపడానికి ఇలా వచ్చారా అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు.

ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడానికి ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని ఒక లో దుస్తుల కంపెనీ ఇచ్చిన బంపర్ ఆఫర్‌కు ఇలా ఓటర్లు బికినీలు, అండర్ వేర్లు ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ‘బడ్జీ స్మగ్లర్స్’ అనే స్విమ్మింగ్ వేర్ కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఎవరైనా అండర్ వేర్ లేదా బికినీలో ఓటేస్తూ ఫొటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో #SmugglersDecide అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేస్తే తమ బ్రాండ్ స్విమ్ వేర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఒకరిద్దరో.. మహా అంటే 20 మంది ఈ ఆఫర్‌కు ఆకర్షితులు అవుతారని కంపెనీ భావించింది. కానీ ఏకంగా వందలాది మంది ఓటర్లు ఇలా బికినీలు, అండర్‌వేర్లు ధరించి పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు.

అలా లోదుస్తుల్లోనే ఓట్లేసి, ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కంపెనీ విసిరిన ఛాలెంజ్‌లో పాల్గొనడానికే ఇలా వచ్చారని తెలుసుకొని అధికారులతో పాటు ఇతర ఓటర్లు కూడా ముక్కున వేలేసుకున్నారు. కాగా, తమ ఆఫర్‌కు స్పందించిన అందరికీ సోమవారం నుంచి బహుమతులు ఇస్తామని కంపెనీ కూడా ప్రకటించింది.

కాగా, ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత తొలి సారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు ఎన్నికలు నిర్వహించగా.. 48 శాతానికి పైగా ఓటర్లు ముందస్తు ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌లో పాల్గొన్నారు. మిగిలిన ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

First Published:  23 May 2022 12:01 AM GMT
Next Story