Telugu Global
NEWS

మహిళా టీ-20 లో ముక్కోణపు పోరు 3 జట్లు, 4 మ్యాచ్ ల హంగామా!

టాటా ఐపీఎల్ -15వ సీజన్ లో 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ సమరం ముగియటంతో..ఆఖరిదశ నాలుగుజట్ల ప్లే-ఆఫ్ పోరుకు కోల్ కతా ముస్తాబవుతుంటే..మరోవైపు మహిళా టీ-20 చాలెంజర్ సిరీస్ హంగామాకు పుణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మొత్తం 3 జట్లు ( సూపర్ నోవాస్, ట్ర్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ ), నాలుగు మ్యాచ్ లుగా జరిగే ఈ మినీ సిరీస్ కోసం ఐపీఎల్ బోర్డు తుదిజట్లను ఖరారు చేసింది. […]

మహిళా టీ-20 లో ముక్కోణపు పోరు 3 జట్లు, 4 మ్యాచ్ ల హంగామా!
X

టాటా ఐపీఎల్ -15వ సీజన్ లో 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ సమరం ముగియటంతో..ఆఖరిదశ నాలుగుజట్ల ప్లే-ఆఫ్ పోరుకు కోల్ కతా ముస్తాబవుతుంటే..మరోవైపు మహిళా టీ-20 చాలెంజర్ సిరీస్ హంగామాకు పుణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
మొత్తం 3 జట్లు ( సూపర్ నోవాస్, ట్ర్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ ), నాలుగు మ్యాచ్ లుగా జరిగే ఈ మినీ సిరీస్ కోసం ఐపీఎల్ బోర్డు తుదిజట్లను ఖరారు చేసింది.
సూపర్ నోవాస్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, ట్రైల్ బ్లేజర్స్ కు స్మృతి మంధానా, వెలాసిటీజట్టుకు దీప్తి శర్మ నాయకత్వం వహించనున్నారు.

28న పుణే వేదికగా ఫైనల్స్…
ఐపీఎల్ కు అనుబంధంగా మహిళా టీ-20 సిరీస్ ను బీసీసీఐ గత కొద్దిసంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుత సీజన్ టోర్నీని మే 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
వివిధ దేశాలకు చెందిన 12మంది ప్రముఖ క్రికెటర్లు సైతం భారత క్రికెటర్లతో కలసి పాల్గోనున్నారు. ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్లు చొప్పున..మొత్తం మూడుజట్లను
భారత మహిళా క్రికెట్ సమాఖ్య ఖరారు చేసింది.
మే 24న జరిగే పోటీలో సూవర్ నోవాస్ తో వెలాసిటీ, మే 26న జరిగే పోరులో వెలాసిటీతో ట్రైల్ బ్లేజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 28న టైటిల్ సమరం జరుగనుంది.
సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్ నాయకత్వం…
భారత టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్..సూపర్ నోవాస్ జట్టుకు నాయకత్వం వహించనుంది. జట్టులోని ఇతర సభ్యుల్లో తానియా భాటియా, అలానాకింగ్, ఆయుశ్ సోనీ, చందు, దేవేంద్ర డోటిన్, హర్లీన్ డియోల్, మేఘ్నాసింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్ర్రకర్, ప్రియా పూనియా, కనోజియా, సోఫీ ఈకెల్ స్టీన్, సునేలూస్, మాన్సీ జోషీ ఉన్నారు.
స్టార్ ఓపెనర్ స్మృచి మంఛానా సారథ్యంలోని ట్రెయిల్ బ్లేజర్స్ జట్టులో పూనం యాదవ్, అరుధతీ రెడ్డీ, హేలా మాథ్యూస్, జెమీమా రోడ్రిగేస్, ప్రియాంకా ప్రియదర్శని, రాజేశ్వరీ గయక్వాడ్. రేణుకా సింగ్, రిచా ఘోశ్, మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖటూన్ , షర్మీన్ అక్తర్, సోఫీ బ్రౌన్, సుజాతా మాలిక్, పోకార్కర్ సభ్యులుగా ఉన్నారు.
వెలాసిటీ జట్టుకు దీప్తి శర్మను కెప్టెన్ గా నియమించారు. జట్టులోని ఇతర సభ్యుల్లో స్నేహ రాణా, షఫాలీ వర్మ, అయాబోంగా ఖాకా, నవ్ గిరీ, కాథ్రిన్ క్రాస్,
కీర్తి జేమ్స్, లారా వూల్వార్ట్, మాయా సోనావానే, నథక్కన్ చాంటామ్, రాథా యాదవ్, ఆరతీ కేదార్ ఉన్నారు.
మొత్తం మూడుజట్లు సమతూకంతో ఉండడంతో మగువల మక్కోణపు పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మహిళా టీ-20కి ఓ రూపునివ్వటానికి వీలుగా ఐపీఎల్ బోర్డు గత మూడేళ్లుగా చాలెంజర్ సిరీస్ ను నిర్వహిస్తూ వస్తోంది.

First Published:  23 May 2022 7:34 AM IST
Next Story