రేవంత్ రెడ్డి కుల వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయా?
ఓపెన్‌గా చెప్పాలంటే టీడీపీ వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో కమ్మ, రెడ్ల మధ్య పోరు తీవ్రంగా నడిచింది. చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అది పతాక స్థాయికి చేరింది. అలాంటి సమయంలో చంద్రబాబు వెంట ఉంటూ.. చంద్రబాబు ధుర్వోధనుడు అయితే తాను కర్ణుడి లాంటి వాడినని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ మరణంపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు మరెవరూ చేయనంత తీవ్రంగా ఉండేవి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మాత్రం రేవంత్ కొత్త ఎత్తులు […]
ఓపెన్‌గా చెప్పాలంటే టీడీపీ వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో కమ్మ, రెడ్ల మధ్య పోరు తీవ్రంగా నడిచింది. చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అది పతాక స్థాయికి చేరింది. అలాంటి సమయంలో చంద్రబాబు వెంట ఉంటూ.. చంద్రబాబు ధుర్వోధనుడు అయితే తాను కర్ణుడి లాంటి వాడినని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ మరణంపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు మరెవరూ చేయనంత తీవ్రంగా ఉండేవి.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మాత్రం రేవంత్ కొత్త ఎత్తులు ప్రయోగిస్తున్నారు. రెడ్లను తన చుట్టూ వలయంగా మార్చుకునేందుకు క్యాస్ట్ కార్డును బహిరంగంగానే ప్రయోగిస్తున్నారు. దాని వల్ల ఆయనకు జరిగే లాభం ఏంటో గానీ, సామాజికవర్గానికి, కాంగ్రెస్‌కు భారీ నష్టం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
తెలంగాణలో రాజకీయంగా ఆ సామాజికవర్గం బలంగానే ఉంది. దాన్ని గుర్తించే కేసీఆర్ కూడా మంత్రి పదవుల్లో బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. రేవంత్ మాత్రం కేసీఆర్‌పై రెడ్లలో వ్యతిరేకత సృష్టించాలని భావిస్తున్నట్టుగా ఉంది. కర్నాటకలో జరిగిన ఒక రెడ్డి సంఘం సమావేశంలో.. రెడ్లు, వెలమల ప్రస్తావన తెచ్చేశారు.
కాకతీయ రాజులు.. రెడ్డి సామంత రాజులను కాకుండా వెలమ సామంతరాజులను ముందు పెట్టి యుద్ధం చేశారు అందుకే కాకతీయ సామ్రాజ్యం పతనమైందన్నారు. రెడ్లను నమ్మిన వారు నష్టపోయినట్టు చరిత్రలో లేదన్నారు. ఆ రోజుల నుంచే వెలమలకు, రెడ్లకు పడదు అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలను రెడ్లకు అప్పగిస్తే అధికారంలోకి వస్తాయని కూడా చెప్పారు.
ఇప్పుడెందుకు రేవంత్ ఈ కామెంట్స్ చేశారు అంటే.. రెడ్లను టీఆర్‌ఎస్‌కు దూరం చేసి, వారిని తన ఎదుగుదలకు వాడుకోవాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ఉంటున్న నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఒక్క మాటతో కాంగ్రెస్ పార్టీని చంపేశారని ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్.. రెడ్డి కాంగ్రెస్ అయిందని బండ్ల విమర్శించారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేసి దాన్ని రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు బండ్ల గణేష్.
ALSO READ: పక్రియ నుంచి ఎమ్మెల్సీని ఎవరూ తప్పించలేరు- అంబటి రాంబాబు