ఈ హ్యాకర్ల రూటే వేరు.. సిస్టమ్ హ్యాక్ చేసి ఏం డిమాండ్ చేస్తారో తెలుసా?
ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఎన్నో రకాల గ్యాడ్జెట్లను మనం వాడుతున్నాం. పీసీ, ల్యాప్‌టాప్, మొబైల్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం. బ్యాకింగ్ దగ్గర నుంచి ఆఫీస్ పనుల వరకు నిత్యం మనం ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటూ పనులను సులభంగా చేస్తున్నాము. దీంతో ఎన్నో పనులు చిటికెలో సాధ్యం అవుతున్నాయి. మన ల్యాప్‌టాప్స్, పీసీలు, మొబైల్స్, ట్యాబ్స్‌లో ఎన్నో ఫైల్స్ భద్రపరిచి ఉంచుతాము. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఒక చోట […]
ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఎన్నో రకాల గ్యాడ్జెట్లను మనం వాడుతున్నాం. పీసీ, ల్యాప్‌టాప్, మొబైల్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం. బ్యాకింగ్ దగ్గర నుంచి ఆఫీస్ పనుల వరకు నిత్యం మనం ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటూ పనులను సులభంగా చేస్తున్నాము. దీంతో ఎన్నో పనులు చిటికెలో సాధ్యం అవుతున్నాయి. మన ల్యాప్‌టాప్స్, పీసీలు, మొబైల్స్, ట్యాబ్స్‌లో ఎన్నో ఫైల్స్ భద్రపరిచి ఉంచుతాము. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఒక చోట భద్రపరిచి ఉంచుతాయి. ఇలాంటి వాటిపై హ్యాకర్లు దాడి చేసి మన డేటాను తస్కరిస్తుంటాయి. ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీ రోజు హ్యాకర్ల దాడికి ఎన్నో సంస్థలు గురవుతున్నాయి. విలువైన సమాచారాన్ని దొంగిలించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబడుతున్నాయి.
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హ్యాకర్లు కాస్త డిఫరెంట్. వీళ్లు కూడా మన కంప్యూటర్లలో కి చొరబడి మన సమాచారాన్ని దొంగిలించి.. మన ఫైళ్లను లాక్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. అయితే వాళ్లు డబ్బులు అడగటం లేదు.. వెరైటీగా పేదలకు సహాయం చేయమని కోరుతున్నారు. ఇండియాలో ఇలాంటి రాన్‌సమ్‌వేర్ ఒకటి చక్కర్లు కొడుతున్నట్లు డిజిటల్ రిస్క్ మానిటరింగ్ సంస్థ క్లౌడ్‌సెక్ (CloudSEK) గుర్తించింది. ఈ రాన్‌సమ్‌వేర్ బారిన పడిన బాధితులు, కంపెనీలు తమ ఫైల్స్‌ను తిరిగి పొందాలంటే పేదలకు సహాయం చేయాలని హ్యాకర్లు కోరడం విశేషం.
ఇల్లు లేని వారికి కొత్త బట్టలు విరాళంగా ఇవ్వడం, పేద పిల్లలను బ్రాండెడ్ పిజ్జా రెస్టారెంట్లకు తీసుకెళ్లి వారికి ఆహారం కొనివ్వడం, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం వంటివి చేయాలని ఆ రాన్‌సమ్‌వేర్ ఆపరేటర్లు (హ్యాకర్లు) సూచిస్తున్నారు. అంతే కాదు.. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే తిరిగి డేటాను ఇస్తామంటూ చెప్తున్నారు. ఈ గుడ్ విల్ రాన్‌సమ్‌వేర్‌ను మార్చిలో గుర్తించినట్లు క్లౌడ్‌సెక్ తెలిపింది.
సాధారణంగా హ్యాకర్లు డేటాను తస్కరించి భారీగా డబ్బులు అడుగుతారు. అయితే ఈ రాన్‌సమ్‌వేర్ ఆపరేటర్లు మాత్రం.. కంప్యూటర్లలోకి చొరబడి డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి దాన్ని తిరిగి పొందాలంటే పేదలకు సహాయం చేయాలని కోరుతున్నారు. కొత్త బట్టలు విరాళంగా ఇచ్చి వాటిని ఫొటోలు తీయాలి.. ఆ తర్వాత ఐదుగురు పిల్లలకు తక్కువ కాకుండా పిజ్జాలు తినిపించి వాటి ఫొటోలు, వీడియోలు తీయాలి.. ఆ తర్వాత వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి. ఇక వైద్య సహాయం అందించిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను ఆడియో రూపంలో ఆపరేటర్లకు పంపాలి. ఈ మూడు పనులు పూర్తి చేసిన తర్వాత ఒక సోషల్ మీడియా పోస్టు చేయాలి. రాన్‌సమ్‌వేర్ బాధితులమైన తాము ఎంత దయగల వాళ్లమో చెప్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాలి.
ఆ తర్వాత హ్యాకర్లు వీటిని పరిశీలించి ఫైళ్లను ఎలా డీక్రిప్షన్ చేసుకోవాలో చెస్తూ ఒక వీడియోతో పాటు పాస్‌వర్డ్ ఫైల్‌ను పంపిస్తారు. అయితే ఈ రాన్‌సమ్‌వేర్ తాత్కాలికంగానే ఉంటుందా లేదా పర్మనెంట్‌గా సెటిల్ అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని క్లౌడ్‌సెక్ తెలిపింది.
ALSO READ: ఎమ్మెల్సీ అనంతబాబుపై బొత్స కీలక వ్యాఖ్యలు