Telugu Global
National

జ్ఞానవాపి మసీదు లో శివలింగం పూజకు అనుమతించాలి " కోర్టును కోరిన పూజారి

వారణాసి లోని జ్ఞానవాపి మసీదు లో శివలింగం ఉన్నట్టు బైటపడింది కాబట్టి ఆ లింగాన్ని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కాశీ ఆలయ ప్రధాన పూజారి కులపతి త్రిపాఠి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషనే కాకుండా హిందూ వర్గాల తరపున మరొక పిటిషన్ కూడా ఈ రోజు కోర్టు విచారణకు రానుంది. ఈ రెండు పిటిషన్లలో పేర్కొన్న అంశాలు…. 1. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శృంగార గౌరీకి రోజువారీ పూజకు అనుమతించాలి 2. మసీదులోని వజుఖానాలో కనిపించే […]

జ్ఞానవాపి మసీదు లో శివలింగం పూజకు అనుమతించాలి  కోర్టును కోరిన పూజారి
X

వారణాసి లోని జ్ఞానవాపి మసీదు లో శివలింగం ఉన్నట్టు బైటపడింది కాబట్టి ఆ లింగాన్ని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కాశీ ఆలయ ప్రధాన పూజారి కులపతి త్రిపాఠి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషనే కాకుండా హిందూ వర్గాల తరపున మరొక పిటిషన్ కూడా ఈ రోజు కోర్టు విచారణకు రానుంది. ఈ రెండు పిటిషన్లలో పేర్కొన్న అంశాలు….

1. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శృంగార గౌరీకి రోజువారీ పూజకు అనుమతించాలి

2. మసీదులోని వజుఖానాలో కనిపించే శివలింగం పూజకు అనుమతించాలి

3. శివలింగం కింద గదికి వెళ్లే మార్గంలో చెత్తను తొలగించాలి.

4. శివలింగం పొడవు, వెడల్పు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలి.

5. ప్రత్యామ్నాయ వజుఖానా ఏర్పాటు చేయాలి.

ఈ ఐదు అంశాలపై వారణాసి జిల్లా కోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసులో న్యాయవాదులు మాత్రమే కోర్టులో హాజరు కావాలని జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేశ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

16వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారని వారణాసి కోర్టులో 1991 నుండి కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మసీదు కమిటీ సుప్రీం కోర్టుకు వెళ్ళగా జ్ఞానవాపి కేసును జిల్లా కోర్టే విచారించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

First Published:  23 May 2022 2:21 AM GMT
Next Story