Telugu Global
NEWS

స్కై వాక్ బ్రిడ్జిలతో రూపురేఖలు మారిపోనున్న హైదరాబాద్

హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. ఒక వైపు ప్రజల అవసరాలు తీరుస్తూనే టూరిజం కూడా అభివృద్ది జరిగే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దుర్గం చెరువు మీద‌ కేబుల్ బ్రిడ్జి నిర్మించిన ప్రభుత్వం ప్రస్తుతం మెహదీ పట్నం, ఉప్పల్ లలో స్కైవాక్‌ నిర్మాణం చేపట్టింది. మెహదీపట్నం వద్ద శరవేగంగా స్కైవాక్‌ నిర్మాణం జరుగుతోంది. గుడి మల్కాపూర్‌ జంక్షన్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే […]

Mehdipatnam Skywalk
X

హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. ఒక వైపు ప్రజల అవసరాలు తీరుస్తూనే టూరిజం కూడా అభివృద్ది జరిగే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దుర్గం చెరువు మీద‌ కేబుల్ బ్రిడ్జి నిర్మించిన ప్రభుత్వం ప్రస్తుతం మెహదీ పట్నం, ఉప్పల్ లలో స్కైవాక్‌ నిర్మాణం చేపట్టింది.

మెహదీపట్నం వద్ద శరవేగంగా స్కైవాక్‌ నిర్మాణం జరుగుతోంది. గుడి మల్కాపూర్‌ జంక్షన్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లై ఓవర్‌ దిగువ నుంచి బస్టాండ్‌ వరకు ఈ స్కైవాక్‌ నిర్మాణం జరగనుంది. అదే విధంగా ఫ్లై ఓవర్‌ పై నుంచి బస్టాండ్‌లను కలుపుతూ నిర్మాణం సాగుతోంది. 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పుతో 16 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు.

మరో వైపు రైతుబజార్‌ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ వరకు మరో స్కైవాక్‌ను నిర్మించి పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే కింది నుంచి వచ్చే స్కైవాక్‌కు కలుపుతారు. దాంతో గుడి మల్కాపూర్‌ నుంచి వచ్చే జనం, రైతు బజార్, ఆసిఫ్‌నగర్‌ నుంచి వచ్చే జనం వీటి పైనుంచే రాకపోకలు సాగిస్తారు.

ఈ స్కైవాక్ నిత్యం రద్దీగా ఉండే మెహదీపట్నం జంక్షన్‌లో దశాబ్దాల నాటి పాదచారుల కష్టాలను పరిష్కరించనుంది. 32.97 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఈ నిర్మాణం సాగిస్తోంది.

6.15 మీటర్లు ఎత్తు, 4 మీటర్ల వెడల్పు తో ఈ స్కై వాక్ నిర్మాణం జరుగుతోంది. కొన్ని చోట్ల మాత్రం ఎత్తు మూడు మీటర్లు, కొన్ని చోట్ల వెడల్పు ఒక మీటరు మేర తగ్గుతుంది” అని HMDA అధికారి ఒకరు తెలిపారు.

స్కైవాక్ బస్ స్టాప్ పైన 21,061.42 sft వాణిజ్య ప్రాంతం ఉంది. ఆ ప్రదేశంలో కాఫీ షాపులు, లాంజ్ స్నాక్స్ మొదలైనవాటిని ఏర్పాటు చేసుకోవచ్చు అని HMDA అధికారి తెలిపారు.

First Published:  23 May 2022 8:51 AM IST
Next Story