భారీ అప్పుకు సిద్ధమవుతున్న కేంద్రం
రాష్ట్రాలకు అప్పులు చేయవద్దంటూ చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాను మాత్రం భారీగా అప్పులు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అప్పు 153 లక్షల కోట్లు దాటింది. మోడీ ప్రధాని అయిన 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు కేవలం 53 లక్షల కోట్లు మాత్రమే. ఇప్పటికే 153 లక్షల కోట్లు అప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది మరో 14.31 లక్షల కోట్లు అప్పు తెచ్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ధరలు భారీగా పెరిగిపోతుండగా.. ద్రవ్యోల్బం సూచీలు […]
రాష్ట్రాలకు అప్పులు చేయవద్దంటూ చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాను మాత్రం భారీగా అప్పులు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అప్పు 153 లక్షల కోట్లు దాటింది. మోడీ ప్రధాని అయిన 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు కేవలం 53 లక్షల కోట్లు మాత్రమే.
ఇప్పటికే 153 లక్షల కోట్లు అప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది మరో 14.31 లక్షల కోట్లు అప్పు తెచ్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ధరలు భారీగా పెరిగిపోతుండగా.. ద్రవ్యోల్బం సూచీలు గరిష్ట స్థాయిని తాకడంతో.. ఆర్‌బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ప్రజలపై ధరల భారాన్ని తగ్గించకుంటే మరో శ్రీలంక అవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను కొద్ది మేర కేంద్రం తగ్గించింది.
భారీగా అప్పు తెచ్చేందుకు పెట్రోల్ ధరల తగ్గింపును ఒక కారణంగా కేంద్రం చూపుతోంది. పెట్రో ధరలు తగ్గించడం వల్ల లక్ష కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నామని కేంద్రం చెబుతోంది. ఆ లోటును పూరించుకునేందుకు భారీగా అప్పులు తేవాల్సి ఉంటుందని కేంద్రం అంటోంది. కనీసం 14.31లక్షల కోట్ల కొత్త అప్పు తెస్తేనే బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలను సాధించగలమని కేంద్ర వర్గాల చెబుతున్న మాట.
ALSO READ: గులాబీకి గుడ్ బై లిస్ట్ రెడీ అయిందా?