Telugu Global
NEWS

సమస్య అని దగ్గరకు పిలిస్తే, రాజ్యసభ సీటు అడిగారు

ఆర్‌. కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని విచిత్రంగా బీసీ సంఘాలే జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం అంటే ఏపీలోని బీసీలను అవమానించడమేనంటూ వారు విమర్శిస్తున్నారు. ఏపీలోని నిరుద్యోగసంఘాల నేతలూ ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తుండడం విశేషం. ఏపీలో ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పిన సీఎం రాజ్యసభ సీట్లలో రెండింటిని తెలంగాణ వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశాఖ వెళ్లగా అక్కడ నిరుద్యోగ జేఏసీ నేతలు […]

సమస్య అని దగ్గరకు పిలిస్తే, రాజ్యసభ సీటు అడిగారు
X

ఆర్‌. కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని విచిత్రంగా బీసీ సంఘాలే జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం అంటే ఏపీలోని బీసీలను అవమానించడమేనంటూ వారు విమర్శిస్తున్నారు. ఏపీలోని నిరుద్యోగసంఘాల నేతలూ ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తుండడం విశేషం.

ఏపీలో ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పిన సీఎం రాజ్యసభ సీట్లలో రెండింటిని తెలంగాణ వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశాఖ వెళ్లగా అక్కడ నిరుద్యోగ జేఏసీ నేతలు కలిశారు. చేతిలో వినతిపత్రం పట్టుకుని నిలబడి ఉండడం చూసిన మంత్రి పెద్దిరెడ్డి.. వారి సమస్యను తెలుసుకునేందుకు దగ్గరకు వెళ్లారు. వారి నుంచి వినతిపత్రాన్ని తీసుకున్నారు.

ఇంతలో జేఏసీ అధ్యక్షుడు తమకూ ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ మంత్రిని అడిగేశారు. తెలంగాణకు చెందిన ఆర్‌ కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చినట్టుగానే, తమకూ ఒక రాజ్యసభ సీటు ఇచ్చి నిరుద్యోగులను గుర్తించాలని కోరారు.

దాంతో మంత్రికి అసలు విషయం అర్థమైపోయింది. ఉద్దేశపూర్వకంగా వారు వచ్చారని తెలుసున్న మంత్రి పెద్దిరెడ్డి .. పెద్దగా చర్చ పెట్టకుండా.. అలాగే.. పరిశీలిద్దామంటూ వినతిపత్రం తీసుకుని లోనికి వెళ్లిపోయారు.

First Published:  22 May 2022 3:31 AM IST
Next Story