Telugu Global
NEWS

తెలంగాణ అభివృద్దిలో ఎన్ ఆర్ ఐ లు భాగస్వాములు కావాలి -కేటీఆర్

హైదరాబాదే కాకుండా రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ఎన్ ఆర్ ఐ లను కోరారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. యూకే పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో ఆయన‌ ప్రసంగించారు.ఎన్ ఆర్ ఐ లు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. కేటీఆర్ తన పర్యటనలో ప‌లువురు వీదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశ ఫలితాలు త్వరలోనే రాష్ట్రానికి […]

తెలంగాణ అభివృద్దిలో ఎన్ ఆర్ ఐ లు భాగస్వాములు కావాలి -కేటీఆర్
X

హైదరాబాదే కాకుండా రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ఎన్ ఆర్ ఐ లను కోరారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. యూకే పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో ఆయన‌ ప్రసంగించారు.ఎన్ ఆర్ ఐ లు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు.

కేటీఆర్ తన పర్యటనలో ప‌లువురు వీదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశ ఫలితాలు త్వరలోనే రాష్ట్రానికి అందివస్తాయని కేటీఆర్ అన్నారు. యూకేతో భవిష్యత్తులో రాష్ట్ర సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని కేటీఆర్ అన్నారు.

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ అత్యంత కీలకమని, కొత్త రాష్ట్రమైనప్పటికీ తలసరి ఆదాయం, జీడీపీ వంటి అంశాల్లో కొత్త రికార్డును సృష్టించిందని చెప్పారు కేటీఆర్. భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ అభివృద్దిని ఎన్ ఆర్ ఐ లు మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఆయన కోరారు.

ALSO READ: జగన్‌ విమానం లండన్‌లో దిగడం వెనుక ఇదీ కారణం

First Published:  22 May 2022 2:28 AM IST
Next Story