పవన్ ది డ్రామా. అది కోత కాదు, ట్రిప్
శుక్రవారం మంగళగిరి కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై వెంటనే పవన్ గట్టిగా నవ్వుతూ.. ఏపీలో అంధకారం అంటూ మాట్లాడారు. ఫొటోలు తీయించి ప్రచారం చేశారు. సెల్‌ఫోన్ వెలుగులో మాట్లాడారు. ఈ ఘటనపై మీడియాలో పెద్దెత్తున ప్రచారం జరగడంతో విద్యుత్ శాఖ స్పందించింది. అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీసి వివరాలను వెల్లడించింది. కరెంట్ సరఫరా ఆగిపోవడానికి కారణం కోతలు కాదని స్పష్టం చేశారు. గాలుల కారణంగా సరఫరా ట్రిప్ అయిందని.. […]
శుక్రవారం మంగళగిరి కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై వెంటనే పవన్ గట్టిగా నవ్వుతూ.. ఏపీలో అంధకారం అంటూ మాట్లాడారు. ఫొటోలు తీయించి ప్రచారం చేశారు. సెల్‌ఫోన్ వెలుగులో మాట్లాడారు.
ఈ ఘటనపై మీడియాలో పెద్దెత్తున ప్రచారం జరగడంతో విద్యుత్ శాఖ స్పందించింది. అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీసి వివరాలను వెల్లడించింది. కరెంట్ సరఫరా ఆగిపోవడానికి కారణం కోతలు కాదని స్పష్టం చేశారు. గాలుల కారణంగా సరఫరా ట్రిప్ అయిందని.. ఐదు నిమిషాలకే తిరిగి విద్యుత్ సరఫరా వచ్చిందని అధికారులు వెల్లడించారు.
రాత్రి 8.30 నుంచి 8.35 నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు విద్యుత్ సరఫరా ఆగినట్టు విద్యుత్ సబ్ స్టేషన్ రికార్డుల్లోనూ నమోదు అయింది. కేవలం గాలుల కారణంగా సాంకేతిక సమస్యతో విద్యుత్ సరఫరా ట్రిప్ అయితే దాన్ని కోతలుగా ప్రచారం చేయడాన్ని విద్యుత్ శాఖ తప్పుపడుతోంది. విద్యుత్ సరఫరా ఐదు నిమిషాల్లో పునరుద్దరించామని, 20 నిమిషాల పాటు విద్యుత్ ఆగిపోయిందనడంలో వాస్తవం లేదని విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జే. పద్మజనార్దన్ రెడ్డి వివరించారు.
మరోవైపు జనసేన కార్యాలయం వద్ద జనరేటర్ ఉంది. అది అటోమెటిక్‌గా ఎందుకు రన్ రాలేదన్న చర్చ నడుస్తోంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడం, ఫొటోలు, వీడియోలు తీయడం, అంతా పూర్తయిన తర్వాత వెళ్లి జనరేటర్‌ను ఆన్ చేశారన్న ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఇలా డ్రామా నడిపారన్న విమర్శలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయి.