Telugu Global
Cinema & Entertainment

రీమేక్ చేయడానికి రీజన్ చెప్పిన రాజశేఖర్

శేఖర్ అనే మరో రీమేక్ తో తెరపైకొచ్చారు రాజశేఖర్. లాంగ్ గ్యాప్ తీసుకొని మరీ ఓ రీమేక్ ప్రాజెక్టులో రావడం వెనక కారణాన్ని బయటపెట్టారు. డిఫరెంట్ గా ఉన్న కథల్ని మాత్రమే తను రీమేక్ చేస్తానని, శేఖర్ చూస్తే తన టేస్ట్ ఎంటో తెలుస్తుందని అంటున్నాడు ఈ సీనియర్ హీరో. “తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం, ఇలా నా సినిమాలన్నీ రీమేక్ సినిమాలే.. రీమేక్ లో తీసిన ప్రతి […]

రీమేక్ చేయడానికి రీజన్ చెప్పిన రాజశేఖర్
X

శేఖర్ అనే మరో రీమేక్ తో తెరపైకొచ్చారు రాజశేఖర్. లాంగ్ గ్యాప్ తీసుకొని మరీ ఓ రీమేక్ ప్రాజెక్టులో రావడం వెనక కారణాన్ని బయటపెట్టారు. డిఫరెంట్ గా ఉన్న కథల్ని మాత్రమే తను రీమేక్ చేస్తానని, శేఖర్ చూస్తే తన టేస్ట్ ఎంటో తెలుస్తుందని అంటున్నాడు ఈ సీనియర్ హీరో.

“తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం, ఇలా నా సినిమాలన్నీ రీమేక్ సినిమాలే.. రీమేక్ లో తీసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి అయితే ఒక్క “శేషు” మాత్రం పెద్ద సక్సెస్ కాలేదంటే దాని ఇమేజ్ తక్కువ చేశాము. అయితే టీవీ లో మాత్రం హిట్ అయ్యింది. జోసెఫ్ మలయాళం లో సక్సెస్ అయ్యింది. మలయాళంలో సక్సెస్ అయిన సినిమాలు చాలా చేశాను.రీమేక్ చేస్తే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అన్న అడ్వాంటేజ్ ఉంటుంది. రీమేక్ లో అందుకే జోసెఫ్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఏం చేయాలో నా క్యారెక్టర్ కూడా నాకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి నటుడిగా నాకు ఈజీ అవుతుంది.”

ఇలా రీమేక్ చేయడం వెనక రీజన్ ను బయటపెట్టాడు రాజశేఖర్. అయితే రాజశేఖర్ అనుకున్నట్టు అతడి సెంటిమెంట్ నిజం అవ్వలేదు. గతంలో చాలా రీమేక్స్ తో హిట్స్ కొట్టిన ఈ నటుడు, శేఖర్ తో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన బలహీనతగా మారింది.

ALSO READ: ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రీ లుక్ ఇదే

First Published:  21 May 2022 7:34 AM IST
Next Story