Telugu Global
NEWS

బాబుకు బీజేపీకి అనుసంధానమైనది..

భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్‌ బత్తి.. చంద్ర‌బాబుకు బీజేపీకి అనుసంధానమైనది పవన్ జనసేన పార్టీ. ఇలా త‌యారైంది పరిస్థితి. టీడీపీతో పొత్తా ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతో ఉంటూనే ప‌రోక్షంగా టీడీపీ జపం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించడంతోనే పవన్ ప్రయాణం టీడీపీ వైపు మొదలైందన్న భావన ఏర్పడింది. ఇప్పుడు పవన్‌ మరింత స్పష్టత ఇచ్చారు. చంద్రబాబుతో దోస్తీకి బీజేపీని ఒప్పిస్తానంటూ పరోక్ష వ్యాఖ్యలు […]

బాబుకు బీజేపీకి అనుసంధానమైనది..
X

భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్‌ బత్తి.. చంద్ర‌బాబుకు బీజేపీకి అనుసంధానమైనది పవన్ జనసేన పార్టీ. ఇలా త‌యారైంది పరిస్థితి. టీడీపీతో పొత్తా ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతో ఉంటూనే ప‌రోక్షంగా టీడీపీ జపం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించడంతోనే పవన్ ప్రయాణం టీడీపీ వైపు మొదలైందన్న భావన ఏర్పడింది. ఇప్పుడు పవన్‌ మరింత స్పష్టత ఇచ్చారు. చంద్రబాబుతో దోస్తీకి బీజేపీని ఒప్పిస్తానంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

”వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని ఒప్పిస్తా.. అర్థమయ్యేలా బీజేపీ అధిష్టానానికి చెప్పగలను అనుకుంటున్నా” అన్నది పవన్ చేసిన తాజా వ్యాఖ్య. దీన్ని నిశితంగా పరిశీలిస్తే.. తానే కాకుండా బీజేపీని కూడా ఏపీలో చంద్రబాబు దరి చేర్చే కార్యాన్ని తన భుజాలపై పవన్ వేసుకున్నట్టుగా అర్థమవుతోంది. వైసీపీని ఓడించాలంటే టీడీపీ నీడన జనసేనతో పాటు కలిసి వచ్చే పార్టీలన్నీ చేరాలన్నది పవన్ కవిహృదయం. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనకు బీజేపీ దూరంగా ఉంటోంది.

పవన్ రాజకీయ తీరు చూస్తుంటే, బీజేపీతోనే ఉంటూ ఆ పార్టీని కూడా టీడీపీ వైపు మళ్లేలా చేయడం.. ఒకవేళ టీడీపీతో పొత్తుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోతే తీరా ఎన్నికల సమయంలో పవన్ మాత్రమే టీడీపీ చెంత‌న‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీని కాదని ఇప్పటికిప్పుడే చంద్రబాబు చెంత‌కు పవన్ కల్యాణ్ వెళ్తే ఆ పరిణామం బాబుకు ఇబ్బందిగా మారుతుంది. తమ పాట్న‌ర్ ను చంద్రబాబు ఎత్తుకెళ్లారన్న కోపం బీజేపీకి వస్తుంది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి టీడీపీకి ఇబ్బందులు మొదలుతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబు వైపు వెళ్లకుండా.. అసలైన ఎన్నికల వేళ మాత్రం జనసేన టీడీపీని మోయడం వంద శాతం ఖాయంగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌కు కావాల్సింది ఎవరు అధికారంలోకి వస్తారన్నది కాదు.. జగన్‌ ఓడిపోతే చూడడమే.

First Published:  21 May 2022 5:51 AM IST
Next Story