Telugu Global
National

దళిత బాలికలపై లైంగిక వేధింపులు " ప్రశ్నించినందుకు తల్లిపై దాడి

ఇద్దరు దళిత బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ అగ్రకుల వ్యక్తిని నిలదీయ‌డానికి వెళ్ళిన బాధితురాలి తల్లిపై కూడా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దుర్మార్గ ఘటన‌కు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే …. ”కౌశాంబి జిల్లా మహ్మద్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత బాలికలపై ఓ అగ్రకుల వ్యక్తి అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలికల్లోని ఒకరి తల్లి ఈ విషయంపై నిలదీయడానికి ఆ వ్యక్తి […]

దళిత బాలికలపై లైంగిక వేధింపులకు
X

ఇద్దరు దళిత బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ అగ్రకుల వ్యక్తిని నిలదీయ‌డానికి వెళ్ళిన బాధితురాలి తల్లిపై కూడా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దుర్మార్గ ఘటన‌కు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే ….

”కౌశాంబి జిల్లా మహ్మద్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత బాలికలపై ఓ అగ్రకుల వ్యక్తి అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలికల్లోని ఒకరి తల్లి ఈ విషయంపై నిలదీయడానికి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళింది. విషయం మాట్లాడుతుండగానే అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టారు” అని కౌశాంబి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) హేమ్‌రాజ్ మీనా మీడియాకు తెలిపారు.

నిందితుడు, అతని కుటుంబ సభ్యులపై సెక్షన్ 354 (మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోదక (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పిన ఎస్పీ నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

First Published:  21 May 2022 3:19 AM IST
Next Story