Telugu Global
NEWS

మహిళపై వేధింపులు, బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు, ఆస్తుల కేసులో జగన్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలున్న బొల్లినేని గాంధీపై మరో కేసు నమోదు అయింది. గాంధీ గతంలో ఈడీలో పనిచేశారు. ఆ తర్వాత జీఎస్టీ విభాగానికి వచ్చారు. ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన శ్రీధర్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను బెదిరించిన కేసులో గాంధీపై తాజాగా క్రిమినల్ కేసు నమోదు అయింది. 2019లో శ్రీధర్‌ రెడ్డి నివాసానికి జీఎస్టీ అధికారులమంటూ కొందరు వెళ్లారు. ఆ సమయంలో శ్రీధర్‌ రెడ్డి […]

criminal-case-bollineni-gandhi
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు, ఆస్తుల కేసులో జగన్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలున్న బొల్లినేని గాంధీపై మరో కేసు నమోదు అయింది. గాంధీ గతంలో ఈడీలో పనిచేశారు. ఆ తర్వాత జీఎస్టీ విభాగానికి వచ్చారు. ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన శ్రీధర్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను బెదిరించిన కేసులో గాంధీపై తాజాగా క్రిమినల్ కేసు నమోదు అయింది.

2019లో శ్రీధర్‌ రెడ్డి నివాసానికి జీఎస్టీ అధికారులమంటూ కొందరు వెళ్లారు. ఆ సమయంలో శ్రీధర్‌ రెడ్డి లేరు. అతడి భార్యను టార్గెట్ చేసింది ఈ బృందం. వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డి చెప్పినా వారు లెక్క చేయలేదు. ఇళ్లంతా సోదాలు చేశారు. తన భర్త విదేశాల్లో ఉన్నారని ఆయన రాగానే వివరాలన్నీ ఇస్తామని చెప్పినా వినలేదు. బలవంతంగా రాఘవిరెడ్డిని జీఎస్టీ కార్యాలయానికి తరలించారు.

ఆ సమయంలో ఐదు కోట్ల రూపాయాలు లంచం ఇవ్వాలని లేకుంటే వదిలిపెట్టబోమని ఆమెను బొల్లినేని గాంధీ బెదిరించారన్నది అభియోగం. తనకు వ్యాపారంతో సంబంధం లేదని, తానేమీ చేయలేనని ఆమె చెప్పగా.. అసభ్యకరంగా ఆమెను దూషించారు.

వ్యాపారంతో తనకు సంబంధం లేదంటూ ఆమె చూపిన కాగితాలను బొల్లినేని గాంధీ చించేసి, నేల మీద పడేసి బూతులు తిట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆమెను జీఎస్టీ కార్యాలయంలో బొల్లినేని గాంధీ, మరికొందరు వేధించారు. తెల్లవారుజామున ఇంటికి పంపి.. మధ్యాహ్నం మరోసారి రావాల్సిందిగా ఆదేశించారు. మధ్యాహ్నం మరోసారి జీఎస్టీ సిబ్బంది వచ్చి ఆమెను బలవంతంగా జీఎస్‌టీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో తన పట్ల అదనపు కమిషనర్ ఆనంద్‌కుమార్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు రాఘవిరెడ్డి.. జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బొల్లినేని గాంధీ, అతడి బృందం .. మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్.. బొల్లినేని గాంధీ, ఆనంద్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కమిషన్ ఆదేశాల మేరకు వారిపై ఐపీసీ 354,341,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే బొల్లినేని గాంధీపై లంచాలు డిమాండ్ చేసిన కేసులో, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసులు నమోదు అయ్యాయి. 2021 నుంచి బొల్లినేని గాంధీ సస్పెన్షన్‌లో ఉన్నారు.

First Published:  21 May 2022 3:08 AM IST
Next Story