తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తాం -పవన్ కళ్యాణ్ వెల్లడి
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై తెలంగాణ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 30 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పవన్ అభిమాని, జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరమార్షించి వారికి 5 లక్షల చెక్ అందజేశారు. ఈ […]

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై తెలంగాణ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 30 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పవన్ అభిమాని, జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరమార్షించి వారికి 5 లక్షల చెక్ అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి నియోజక వర్గంలో తమ పార్టీకి 5 వేల ఓటు బ్యాంకు ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారని, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా వారే కీలక పాత్ర పోషించాలని పవన్ కోరారు. తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతకోసం దృష్టి సారించామని అసెంబ్లీ ఎన్నికల లోపు పార్టీని మరింత బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ జవాబు ఇవ్వలేదు.