Telugu Global
National

వరల్డ్‌ బాక్సింగ్ లో తెలంగాణ బిడ్డకు స్వర్ణం

ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బిడ్డ, భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్ బంగారు పతకం సాదించింది. గురువారం 52కేజీల‌ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖిత్ 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన ఫ్లై-వెయిట్ ఫైనల్లో నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా కెసి తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో […]

వరల్డ్‌ బాక్సింగ్ లో తెలంగాణ బిడ్డకు స్వర్ణం
X

ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బిడ్డ, భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్ బంగారు పతకం సాదించింది. గురువారం 52కేజీల‌ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖిత్ 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది.

టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన ఫ్లై-వెయిట్ ఫైనల్లో నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా కెసి తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఐదవ భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది.

జరీన్ తన సాంకేతిక చతురతను ఉపయోగించుకుని, అతి చురుకైన పాదాల కదలికతో ప్రత్యర్థిని అధిగమించింది. థాయ్ బాక్సర్ కంటే ఎక్కువ పంచ్‌లు వేసిన నిఖత్ మొదటి రౌండ్‌లో న్యాయనిర్ణేతలందరినీ ఆకట్టుకోగలిగింది. రెండో రౌండ్‌లో జిట్‌పాంగ్‌ 3-2తో విజయం సాధించింది. ఆఖరి రౌండ్‌లో నిఖత్ తన ప్రత్యర్థిపై చివరికి 5.0 తేడాతో గెలుపును స్వంతం చేసుకుంది.

మహిళల వరల్డ్‌ చాంపియన్ షిప్ లో నిజామాబాద్ బిడ్డ‌ నిఖిత్ బంగారు పతకం సాధించగా ఈ టోర్నీలో భారత్‌ నుంచి పాల్గొన్న మొత్తం 12 మంది బాక్సర్లలో మనీషా మౌన్‌ 57కేజీ విభాగంలో, పర్వీన్‌ హుడా 63కేజీ విభాగంలో కాంస్యాలు సాధించారు. ఓవరల్‌గా మహిళల వరల్డ్‌ చాంపియన్ షిప్ లో భారత్‌కు 39 పతకాలు రాగా ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలున్నాయి.

First Published:  20 May 2022 5:19 AM IST
Next Story