Telugu Global
NEWS

నేటి నుంచి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన‌

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు దేశవ్యాప్త పర్యటనకు ఈ రోజు బయలు దేరుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగే రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు ఆయన హాజరవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కేసీఆర్ మే 20, 27 మధ్య తన పర్యటన మొదటి విడతలో ఢిల్లీ, చండీగఢ్, బెంగళూరులకు వెళ్తారు. తరువాత మే 29 మరియు 30 తేదీలలో పశ్చిమ బెంగాల్,బీహార్‌లలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటన‌లో రాజకీయ […]

కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు దేశవ్యాప్త పర్యటనకు ఈ రోజు బయలు దేరుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగే రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు ఆయన హాజరవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

కేసీఆర్ మే 20, 27 మధ్య తన పర్యటన మొదటి విడతలో ఢిల్లీ, చండీగఢ్, బెంగళూరులకు వెళ్తారు. తరువాత మే 29 మరియు 30 తేదీలలో పశ్చిమ బెంగాల్,బీహార్‌లలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటన‌లో రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు, మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు.

కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ సహాయం అందిస్తారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలను కూడా పరమార్షిస్తారు.

మే 20న ఢిల్లీలో సీఎం వివిధ‌ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ ఆర్థికవేత్తలతో చర్చలు జరుపుతారు, జాతీయ మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు.
అనంతరం మే 22న చండీగఢ్‌కు వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ దేశవ్యాప్త రైతుల ఆందోళనలో మరణించిన 600 మంది రైతుల కుటుంబాలను ఓదార్చనున్నారు. రైతు ఉద్యమ‍ం లో మరణించిన వారి కుటుంబాలకుఆర్థిక సహాయంగా ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును సీఎం పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లు కూడా పాల్గొంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీకి చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులు ఇవ్వబడతాయి, ”అని సిఎంఓ ప్రకటన తెలిపింది.

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడను కలవడానికి కేసీఆర్ మే 26న బెంగళూరు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం, కేసీఆర్ మే 27 న రాలెగావ్ సిద్ధిలో సామాజిక కార్యకర్త అన్నా హజారేని కూడా కలుసుకుంటారు. హైదరాబాద్‌కు తిరిగి రావడానికి ముందు ఆయన‌ షిర్డీలోని సాయిబాబా మందిరానికి వెళతారు.

హైదరాబాద్‌లో ఒకరోజు విరామం తర్వాత కేసీఆర్ మే 29న రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, బీహార్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది గాల్వాన్ లోయలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కలుసుకుని ఆర్థిక సాయం అందజేయనున్నారు. .

కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో, కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలను వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళి కలిశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లు హైదరాబాద్‌లో కేసీఆర్ ను కలిశారు.

READ MORE : నేటి నుంచి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన‌

First Published:  19 May 2022 11:36 PM GMT
Next Story