Telugu Global
National

ప్రజాగ్రహం కట్టడికే ఎన్‌కౌంటర్‌. 10 మంది పోలీసులు వీరే

దిశా ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ సిర్పూర్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై లాయర్ జీఎస్‌ మణి స్పందించారు. జీఎస్‌ మణి వేసిన పిటిషన్ ఆధారంగానే ఈ ఎన్‌కౌంటర్‌పై కమిషన్ ఏర్పాటైంది. కేవలం ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్‌కౌంటర్ చేశారని మణి ఆరోపించారు. కమిషన్ నివేదిక కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. 387 పేజీల నివేదికను కమిషన్ ఇచ్చిందని…ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా కమిషన్ […]

దిశా ఎన్‌కౌంటర్
X

దిశా ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ సిర్పూర్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై లాయర్ జీఎస్‌ మణి స్పందించారు. జీఎస్‌ మణి వేసిన పిటిషన్ ఆధారంగానే ఈ ఎన్‌కౌంటర్‌పై కమిషన్ ఏర్పాటైంది.

కేవలం ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్‌కౌంటర్ చేశారని మణి ఆరోపించారు. కమిషన్ నివేదిక కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. 387 పేజీల నివేదికను కమిషన్ ఇచ్చిందని…ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఎన్‌కౌంటర్ చేశారని వ్యాఖ్యానించారు.

ఒక పోలీసు అధికారి తోటి పోలీసులకు ఇలా ఎన్‌కౌంటర్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ కేసు ఎన్‌కౌంటర్లు చేయాలనే ఆలోచనలున్న పోలీసులకు ఒక గుణపాఠం కావాలన్నారు. పోలీసులు తుపాకీని ఇష్టానికి వాడుతామంటే కుదరదన్నారు.

ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెబుతున్న విషయాలు నమ్మసక్యంగా లేవని కమిషన్ తన నివేదికలో అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు వి. సురేందర్, కె. నర్సింహారెడ్డి, షేక్ లాక్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె. వెంకటేశ్వర్లు, ఎస్. అర్వింద్‌గౌడ్‌, డి. జానకీరాం, ఆర్‌. బాలూ రాథోడ్, డి.శ్రీకాంత్‌లపై హత్య నేరం కింద విచారణ జరపాలని కమిషన్ సిఫార్సు చేసింది.

READ MORE: ప్రజాగ్రహం కట్టడికే ఎన్‌కౌంటర్‌. 10 మంది పోలీసులు వీరే
First Published:  20 May 2022 2:47 AM GMT
Next Story