Telugu Global
National

లాలూ ప్రసాద్ పై సీబీఐ మరో కేసు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశపెట్టి అనేక మంది దగ్గర భూములు తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ తాజా కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ తో […]

లాలూ ప్రసాద్ పై సీబీఐ మరో కేసు
X

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ కేసు నమోదు చేయడం గమనార్హం.

లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశపెట్టి అనేక మంది దగ్గర భూములు తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ తాజా కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మిసా, హేమలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టి సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు.

ఈ ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో
శుక్రవారం ఉదయం ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లోని 16 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది.

నేరపూరిత కుట్రతో వ్యవహరించే ఐపిసి సెక్షన్ 120-బి కింద, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

2008 నుండి 2009 వరకు రైల్వేలో ఉద్యోగాల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అనేక మంది ఆస్తులను ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది.

కాగా లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం పట్ల ఆర్ జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఆదేశాల వల్లనే సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆర్ జేడీ నాయకులు అలోక్ మెహతా ఆరోపించారు. ”కావాలనే లాలూ ప్రసాద్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో మాకు తెలుసు” అని లాలూ ప్రసాద్ యాదవ్ సోదరుడు ప్రభునాథ్ యాదవ్ అన్నారు.

First Published:  19 May 2022 9:06 PM IST
Next Story