Telugu Global
NEWS

చంద్రబాబు ఎప్పటికీ మాజీ సీఎంగానే మిగిలిపోతారు -అంబటి

“151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట, 23 సీట్లు మాత్రమే గెలుచుకున్న వ్యక్తి సీఎం పదవికి అర్హుడట..” అంటూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతారని అన్నారు. బాబు జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. అవకాశం దొరకాలే కాని, దేశాన్ని సైతం నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు […]

చంద్రబాబు ఎప్పటికీ మాజీ సీఎంగానే మిగిలిపోతారు -అంబటి
X

“151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట, 23 సీట్లు మాత్రమే గెలుచుకున్న వ్యక్తి సీఎం పదవికి అర్హుడట..” అంటూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతారని అన్నారు. బాబు జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. అవకాశం దొరకాలే కాని, దేశాన్ని సైతం నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని ఎద్దేవా చేశారు. అసలు రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

టీజీ వెంకటేష్ సీటుకి రేటెంత..?

రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారంటూ తమ పార్టీపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదం అని అన్నారు అంబటి రాంబాబు. ఆయన నీఛ రాజకీయాలకు అది పరాకాష్ట అని దుయ్యబట్టారు. టీజీ వెంకటేష్ దగ్గర ఆయన ఎంత వసూలు చేసి రాజ్యసభ సీటు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలకు చెందిన నిర్మలాసీతారామన్, సురేష్ ప్రభుని టీడీపీ తరపున రాజ్యసభకు పంపించలేదా అని ప్రశ్నించారు. వారు చేస్తే తప్పులేదని, తాము పక్క రాష్ట్రాలవారికి టికెట్ ఇస్తే రాద్ధాంతం చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని అన్నారు రాంబాబు.

ఓటుకి సీటు.. చంద్రబాబుకే బాగా తెలుసు..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటును నోటుతో కొనుక్కుని రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిపోయిన చంద్రబాబు ఇక్కడికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. అధికారం కోసం ఆరాటపడుతూ చంద్రబాబు యాత్రల మీద యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇక ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటారని అన్నారు. సీఎం జగన్‌ ను ఓడించే సత్తా చంద్రబాబు, పవన్‌ కు లేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ, ఈడీలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు రాంబాబు.

First Published:  20 May 2022 5:34 PM IST
Next Story