Telugu Global
NEWS

దావోస్ బయలుదేరిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ దావోస్ యాత్రకు బయలుదేరారు. ఈరోజు రాత్రికి ఆయన దావోస్ చేరుకుంటారు. సరిగ్గా రాత్రి 8.30కు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఆయన అడుగుపెడతారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సదస్సులో జగన్‌ పాల్గొంటారు. సీఎం జగన్ తోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్.. ఇతర అధికారులు దావోస్ బయలుదేరారు. దావోస్ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంపై జగన్ కీలక ప్రసంగం […]

cm-jagan-davos
X

ఏపీ సీఎం జగన్ దావోస్ యాత్రకు బయలుదేరారు. ఈరోజు రాత్రికి ఆయన దావోస్ చేరుకుంటారు. సరిగ్గా రాత్రి 8.30కు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఆయన అడుగుపెడతారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సదస్సులో జగన్‌ పాల్గొంటారు.

సీఎం జగన్ తోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్.. ఇతర అధికారులు దావోస్ బయలుదేరారు. దావోస్ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంపై జగన్ కీలక ప్రసంగం చేస్తారని తెలుస్తోంది.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా దావోస్ సదస్సులు ప్రత్యక్షంగా జరగలేదు. కరోనా తర్వాత జరిగే ఈ సదస్సుకి చాలా ప్రాధాన్యత ఉంది.

కరోనా తర్వాత ప్రపంచ వ్యాపార, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పారిశ్రామిక వేత్తలు కూడా తమ వ్యాపార పరిధిని విస్తరించాలంటే కేవలం ఎగుమతులపైనే ఆధారపడకూడదనే నిర్ణయానికి వచ్చారు.

వ్యాపార వికేంద్రీకరణకోసం ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో దావోస్ పర్యటనతో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

అటు తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆయన యూకేలో పర్యటిస్తున్నారు. యూకేలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి దావోస్ వస్తారు. దావోస్ సదస్సులో తెలంగాణకు, ఏపీకి వేర్వేరు పెవిలియన్లు ఏర్పాటు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సదస్సుకు 2200 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని అంచనా.

టీడీపీ హయాంలో దావోస్ పర్యటన అంటే భారీ హంగామా ఉండేది. కానీ ఇప్పుడు జగన్ ప్రచార ఆర్భాటాలకు పోకుండా తను, తన మంత్రులతో కలసి దావోస్ బయలుదేరారు.

ఏపీకి కంపెనీలు రావట్లేదు, పెట్టుబడులు వెన్కకి వెళ్లిపోతున్నాయని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ దశలో ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం జగన్ కృషిచేస్తున్నారు. దావోస్ తో ఆ విమర్శలకు చెక్ పెడతామంటున్నారు వైసీపీ నేతలు.

First Published:  20 May 2022 2:56 AM IST
Next Story