Telugu Global
Others

ఏ మొహం పెట్టుకుని రాయలసీమ వచ్చావు బాబూ..

నిన్నటి వరకూ రాయలసీమ రౌడీయిజం, పులివెందుల పంచాయితీ అంటూ మాట్లాడిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని సీమలో అడుగుపెట్టారో చెప్పాలంటూ నిలదీశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమపై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారని, తాను కూడా సీమవాసిననే విషయం మరచిపోయారని చెప్పారు. రాయలసీమంటే ఎందుకంత ద్వేషం, కించపరిచేలా, అవమానపరిచేలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లపై రాద్ధాంతం ఎందుకు..? ఏపీలో బీసీలు లేరా, కృష్ణయ్యకు ఎందుకు సీటిస్తున్నారంటూ ఇటీవల […]

ఏ మొహం పెట్టుకుని రాయలసీమ వచ్చావు బాబూ..
X

నిన్నటి వరకూ రాయలసీమ రౌడీయిజం, పులివెందుల పంచాయితీ అంటూ మాట్లాడిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని సీమలో అడుగుపెట్టారో చెప్పాలంటూ నిలదీశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమపై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారని, తాను కూడా సీమవాసిననే విషయం మరచిపోయారని చెప్పారు. రాయలసీమంటే ఎందుకంత ద్వేషం, కించపరిచేలా, అవమానపరిచేలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు.

రాజ్యసభ సీట్లపై రాద్ధాంతం ఎందుకు..?
ఏపీలో బీసీలు లేరా, కృష్ణయ్యకు ఎందుకు సీటిస్తున్నారంటూ ఇటీవల టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని తిప్పికొట్టారు శ్రీకాంత్ రెడ్డి. ఇదే కృష్ణయ్యకు తెలంగాణలో చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ప్రాంతీయాభిమానం ఎక్కడికిపోయిందని నిలదీశారు. తమ పార్టీలో ఉంటే కృష్ణయ్య మంచివారు, వైసీపీలోకి వస్తే మాత్రం పక్కరాష్ట్రంలోని వారా అని ప్రశ్నించారు. 40ఏళ్లుగా దేశవ్యాప్తంగా బీసీలకోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టే కృష్ణయ్యకు వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తోందని చెప్పారాయన.

బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టినవారికి చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని, అలాంటి చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు శ్రీకాంత్ రెడ్డి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో, వారు వీపు పగలగొడతారని అని భయపడి, గంపగుత్తగా రాజ్యసభ సభ్యులందర్నీ బీజేపీలోకి పంపించి, వారందర్నీ తాకట్టు పెట్టారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఇలా మూకుమ్మడిగా ఫిరాయించలేదని చెప్పారు.

మూడు రాజధానులకు అడ్డుపడకూడదు కదా..?
మూడు బస్టాండ్ లు కట్టలేని వారు మూడు రాజధానులు ఎలా కడతారంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు శ్రీకాంత్ రెడ్డి. రాజధానులపై కోర్టులకు వెళ్లింది, ఆటంకాలు సృష్టించింది చంద్రబాబే కదా అని అన్నారు. ఓవైపు వాటిని అడ్డుకుంటూ మరోవైపు రాజధానులు కట్టలేదని వైసీపీపై నిందలు వేయడం ఎందుకని అన్నారు. చంద్రబాబుకి ధైర్యం ఉంటే.. మూడు రాజధానులకు స్వాగతం పలకాలని, కోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. అమరావతిని పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూపించి మభ్య పెట్టిన చంద్రబాబు కనీసం కనకదుర్గ ఫైఓ్లవర్‌ ను కూడా వారి హయాంలో పూర్తి చేయలేకపోయారని చెప్పారు.

దేశ వ్యాప్తంగా డీజిల్‌, పెట్రోల్ ధరలు పెరిగితే.. కేంద్రాన్ని విమర్శించే దమ్ములేక, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. ఓడిపోతే ప్రజల మైండ్‌సెట్‌ బాగా లేదనే సంస్కృతి చంద్రబాబుదని అన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, సంక్షేమ పథకాలకు కూడా వాటిని ఖర్చు చేయలేదని, కాంట్రాక్టర్లకు 80 వేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి గద్దె దిగారని, ఇప్పుడు జగన్ పై అప్పులు చేస్తున్నారంటూ నిందలు వేస్తున్నారని అన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఒంగోలులో మహానాడు సభ పెట్టుకుంటే జనం రారని భయపడి.. ఇరుకు షెడ్లలో పెట్టుకుంటున్నారని, దానికి కూడా వైసీపీయే కారణం అనడం సరికాదని చెప్పారు.

శ్రీలంకలో సెటిలవ్వచ్చు కదా..?
పొద్దున లేస్తే చాలు.. శ్రీలంక.. శ్రీలంక అంటూ.. కలవరిస్తున్న చంద్రబాబు.. రావణాసురుడి సంతతిగా ఆ జన్మలో లంకలో పుట్టి, ఈ జన్మలో ఏపీలో పుట్టినట్టున్నారని ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. శ్రీలంకపై మమకారం ఉంటే.. ఆ దేశానికి వెళ్లి అక్కడే సెటిలైతే మంచిదని, అంతేకాని, ఏపీలో ప్రజలకు ఇస్తున్న ఆర్థిక సాయం గురించి హేళనగా మాట్లాడొద్దని సూచించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటికే 95 శాతం అమలు చేశామంటున్న శ్రీకాంత్ రెడ్డి.. చివరకు మేనిఫెస్టోని కూడా కనపడకుండా ఇంటర్నెట్ నుంచి కూడా తొలగించేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు.

First Published:  19 May 2022 1:04 AM GMT
Next Story