Telugu Global
National

జ్ఞానవాపి కేసు విచార‌ణ‌ను ఆపండి " సుప్రీం

జ్ఞానవాపి కేసును సుప్రీంకోర్టు విచారించే వరకు వారణాసి దిగువ కోర్టు విచారణ నిలుపుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే శివలింగం కనిపించిందన్న ప్రాంతంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వారణాసిలోని అంజుమన్ ఇంతేజామియా మసీదు కాంప్లెక్స్‌లోని మా శృంగార్ గౌరీ స్థల్ లో స్థానిక కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వేను సవాల్ చేస్తూ కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు […]

జ్ఞానవాపి
X

జ్ఞానవాపి కేసును సుప్రీంకోర్టు విచారించే వరకు వారణాసి దిగువ కోర్టు విచారణ నిలుపుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే శివలింగం కనిపించిందన్న ప్రాంతంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

వారణాసిలోని అంజుమన్ ఇంతేజామియా మసీదు కాంప్లెక్స్‌లోని మా శృంగార్ గౌరీ స్థల్ లో స్థానిక కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వేను సవాల్ చేస్తూ కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఇది ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 నిబంధనలకు విరుద్ధమని ముస్లిం సంఘం వాదిస్తోంది. అయితే అప్పీల్‌ను కొట్టివేయాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు.

సుప్రీం కోర్టు ముందు ముస్లింల తరపు హాజరైన న్యాయవాది హుజేఫా అహ్మది వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విచారించాల్సిన అత్యవసరం ఉందని, అది ఈరోజే జరగాలని అన్నారు.

అయితే ఈ రోజు జరిగిన వాదనలకు హిందూ సంఘాల‌ తరపున వాదనలు వినిపించే లాయర్ హరిశంకర్‌ జైన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాజరు కాలేదు. దా‍ంతో కోర్టు విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.

ALSO READ: కాలుష్య మరణాల్లో భారత్ ది మొదటి స్థానం

First Published:  19 May 2022 7:40 AM IST
Next Story