Telugu Global
National

స్టాలిన్‌ ను కలిసిన రాజీవ్ హత్యకేసులో దోషి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ బుధవారం జైలు నుంచి విడుదలైన AG పేరారివాలన్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్‌ ను కలిశారు. తన విడుదల కోసం కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి పేరారివాలన్ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం జరిగే పోరాటం కఠినంగా ఉండొచ్చు, సుదీర్ఘకాలం సాగొచ్చు కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టుకు ఉన్న అసాధారణ […]

stalin
X

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ బుధవారం జైలు నుంచి విడుదలైన AG పేరారివాలన్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్‌ ను కలిశారు. తన విడుదల కోసం కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి పేరారివాలన్ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం జరిగే పోరాటం కఠినంగా ఉండొచ్చు, సుదీర్ఘకాలం సాగొచ్చు కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టుకు ఉన్న అసాధారణ అధికారాన్ని ప్రయోగిస్తూ, బుధవారం నాడు సుప్రీంకోర్టు పెరరివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలో పేరారివాలన్, అతని తల్లి అర్పుతమ్మాళ్, వారి కుటుంబ సభ్యులు చెన్నైలో స్టాలిన్‌ ను కలిశారు. ఈ సందర్భంగా పెరారివాలన్ ముఖ్యమంత్రిని కౌగిలించుకున్నారు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పేరారివాలన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టమని అన్నారు.

“ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన క్షణం. నాకంటే మా అమ్మకి ఇది సంతోషకరమైన క్షణం. నా విడుదలకు నిరంతరం సహకరించిన‌ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

భవిష్యత్తు ప్రణాళిక గురించి అడిగినప్పుడు, పెరరివాలన్ తాను దేని గురించి ఆలోచించడం లేదని, “ప్రస్తుతం నేను ఈ స్వేచ్ఛ ను ఆస్వాదించాలనుకుంటున్నాను” అని చెప్పాడు.

పెరరివాలన్ విడుదలను స్వాగతించిన స్టాలిన్, ఆయన‌ 30 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపాడు తన యవ్వనాన్ని మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు స్వేచ్ఛయుత గాలి పీల్చుకోగలుగుతున్నాడు. అని అన్నారు.

జైలు నుంచి ఇంటికి చేరుకోగానే పెరరివలన్ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా పెరరివలన్‌కు శాలువా కప్పి పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు సీఎం స్టాలిన్.

పెరరివాలన్ క్షమాభిక్ష పిటిషన్‌ను భారత రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని సుప్రీం కోర్టు బుధవారంనాటి తీర్పులో పేర్కొంది. “ఈ తీర్పు మానవ హక్కులను మాత్రమే కాకుండా రాష్ట్రాల‌ హక్కులను కూడా సమర్థించింది” అని స్టాలిన్ అన్నారు.

First Published:  19 May 2022 7:32 AM IST
Next Story