మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
మళ్ళీ గ్యాస్ సిలండర్ ధర పెరిగింది. సామాన్యుడిపై కేంద్రం మళ్ళీ బండవేసింది. గురువారం నుండి గృహ అవసరాల సిలిండర్‌కు 3రూపాయల 50 పైసలు, కమర్షియల్ సిలండర్ కు 8 రూపాయలు పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మార్చి 10 తర్వాత ఎల్‌పిజి మరియు ఇంధన ధరలు రెండూ చాలాసార్లు పెంచిన కేంద్ర ఇప్పుడు మరో సారి […]
BY sarvi19 May 2022 11:54 AM IST
X
sarvi Updated On: 20 May 2022 7:13 AM IST
మళ్ళీ గ్యాస్ సిలండర్ ధర పెరిగింది. సామాన్యుడిపై కేంద్రం మళ్ళీ బండవేసింది. గురువారం నుండి గృహ అవసరాల సిలిండర్‌కు 3రూపాయల 50 పైసలు, కమర్షియల్ సిలండర్ కు 8 రూపాయలు పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మార్చి 10 తర్వాత ఎల్‌పిజి మరియు ఇంధన ధరలు రెండూ చాలాసార్లు పెంచిన కేంద్ర ఇప్పుడు మరో సారి ఎల్‌పిజి ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపింది.
ఈ విధంగా ఎల్‌పిజి ధరలు పెంచడం ఈ నెలలో ఇది రెండవ సారి. 14.2 కిలోగ్రాముల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 1,003రూపాయలు. మార్చి 22న 50 రూపాయలు పెంచగా మే 7న మరో 50 రూపాయలు పెంచారు.
స్థానిక పన్నుల దృష్ట్యా వంట గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. గురువారం నాటి ధరల పెరుగుదల తర్వాత, హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ముంబైలో వంట గ్యాస్ సిలిండర్ ధర 1,002 రూపాయలు, కోల్‌కతాలో 1,029 రూపాయలు చెన్నైలో 1,018 రూపాయలుగా ఉంది.
భారతదేశ ద్రవ్యోల్బణం స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇంధన ధరలు ఒకటి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి పెరిగింది.
ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో హోల్‌సేల్ మార్కెట్లలో ధరల పెరుగుదల సూచిక 15.08% వద్ద ఉంది. ఇది ఇప్పుడు వరుసగా 13 నెలలుగా రెండంకెల స్థాయిలో కొనసాగుతోంది.
Next Story