Telugu Global
Cinema & Entertainment

నిజాలు బయటపెట్టిన దిల్ రాజు

నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న దిల్ రాజు తన ఎక్స్ పీరియన్స్ మొత్తం బయటపెట్టారు. సాధారణ ప్రజానీకం ఏమనుకుంటున్నారు, వాళ్ల భ్రమలు ఎలా ఉంటాయి.. ఇండస్ట్రీలో మార్కెట్ పరిస్థితేంటి లాంటి అంశాలన్నింటినీ ఏకరవు పెట్టాడు. టికెట్ రేట్ల పెంపుతో పాటు, నైజాం డిస్ట్రిబ్యూషన్ పై జనాల్లో ఉన్న అపోహలకు సమాధానం ఇచ్చాడు. ఈమధ్య కాలంలో దిల్ రాజు ఇంత ఓపెన్ గా మాట్లాడ్డం ఇదే తొలిసారి. దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. – […]

ఎఫ్4 కూడా వస్తోంది
X

నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న దిల్ రాజు తన ఎక్స్ పీరియన్స్ మొత్తం బయటపెట్టారు. సాధారణ ప్రజానీకం ఏమనుకుంటున్నారు, వాళ్ల భ్రమలు ఎలా ఉంటాయి.. ఇండస్ట్రీలో మార్కెట్ పరిస్థితేంటి లాంటి అంశాలన్నింటినీ ఏకరవు పెట్టాడు. టికెట్ రేట్ల పెంపుతో పాటు, నైజాం డిస్ట్రిబ్యూషన్ పై జనాల్లో ఉన్న అపోహలకు సమాధానం ఇచ్చాడు. ఈమధ్య కాలంలో దిల్ రాజు ఇంత ఓపెన్ గా మాట్లాడ్డం ఇదే తొలిసారి. దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే..

– మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ వుంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

– ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150 ప్లస్ జీఎస్టీ.. జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. ఎఫ్3 సినిమాకు ఇలా సాధారణ రేట్లే ఉన్నాయి. ఇందులో 250లో మాకు వచ్చేది 125 రుపాయిలే.

– ఇక థియేటర్ వుండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా వుంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి మల్టీ ప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లు వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయికి వడ్డీ వస్తుంది. పది హేను కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దిని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీ ప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా.

– ఒక థియేటర్ల గురించి మాట్లాడేటప్పుడు 450థియేటర్ల వున్నాయి నైజాంలో . ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ వుండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే .. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు.

First Published:  19 May 2022 4:02 PM IST
Next Story