Telugu Global
NEWS

విద్యార్థుల ఇంగ్లిష్‌కు జగన్ ఫిదా..!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తామని సీఎం జగన్ ప్రకటించగానే పలువురు భాషాభిమానులు మండిపడ్డారు. తెలుగుభాషను చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇక తెలుగుదేశం పార్టీ సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. జనసేన, బీజేపీ కూడా ఇదే రాగాన్ని అందుకున్నాయి. వైసీపీ నేతలు మాత్రలు రివర్స్ అటాక్ ప్రారంభించారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలు వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలోనే చదివిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటువంటి […]

విద్యార్థుల ఇంగ్లిష్‌కు జగన్ ఫిదా..!
X

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తామని సీఎం జగన్ ప్రకటించగానే పలువురు భాషాభిమానులు మండిపడ్డారు. తెలుగుభాషను చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఇక తెలుగుదేశం పార్టీ సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. జనసేన, బీజేపీ కూడా ఇదే రాగాన్ని అందుకున్నాయి. వైసీపీ నేతలు మాత్రలు రివర్స్ అటాక్ ప్రారంభించారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలు వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలోనే చదివిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటువంటి ప్రశ్న సంధించడంతో దాదాపు ఈ విషయంపై మాట్లాడేందుకు పెద్దగా ఎవరూ సాహసించలేకపోయారు.

ఇక అప్పుడప్పుడు పలువురు భాషాభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా.. ఓ గ్రామంలో ఇంగ్లిష్ మీడియంపై మాట్లాడగా.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు సీఎం జగన్ నాడు – నేడు అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను మెరుగుపరిచారు. ఇంగ్లిష్ బోధన కూడా సాగుతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా, బెండపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లడంతో.. వెంటనే సదరు విద్యార్థులను తాను కలవాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గురువారం బెండపూడికి చెందిన ఐదుగురు విద్యార్థులు వాళ్ల టీచర్ తో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. వీరు కాసేపు సీఎం జగన్ తో ఇంగ్లిష్ లో ముచ్చటించారు.

విద్యార్థినులు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడటంతో సీఎం జగన్ ఫిదా అయ్యారు. సదరు విద్యార్థినులను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావడం వల్లే విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతున్నారని పలువురు వైసీపీ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

First Published:  19 May 2022 1:23 PM IST
Next Story